లాక్ డౌన్ మరో 9 రోజులే..కానీ

105

దేశ వ్యాప్తంగా ఈనెల 14వరకు లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ కూడా కేంద్రం పెంచుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై ఓ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లాక్ డైన్ నిబంధనలు మరో తొమ్మిది రోజులు మాత్రమే ఉంటాయంటున్నారు. అప్పటివరకు ప్రజలు నిబంధనలు పాటిస్తే చాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాను నిరోధించేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, వారి సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

coronavirus outbreak: కరోనాపై పుకార్లు ...

ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… గుంటూరు, విజయవాడ పోలీసులు మరింత కష్టపడి పనిచేస్తున్నారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. గుంటూరులో 30 మంది కరోనా బాధితులు ఉండగా, కృష్ణా జిల్లాలో 28 మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 226 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకరు చికిత్స పొంది వ్యాధి నయం కాగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వల్ల ఒకరు మృతి చెందారు.

మరోవైపు లాక్ డౌన్ మాత్రం ఈనెల 14న ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. రేపు కేంద్ర కెబినెట్ భేటీ నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మంత్రులతే సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ ఎత్తివేతపై ప్రధాని కీలకనిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏప్రిల్ 6న ప్రధాని నుంచి కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేవలం 9 రోజులే లాక్ డౌన్ ఉంటుందని ఏపీ డీజీపీ ఖరాకండిగా చెప్పేయడంతో ఇప్పుడు అందరూ ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు.

Content above bottom navigation