ఏపీ లో జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగింపు.?

ఏపీలో లాక్ డౌన్ ను మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ క్రింది వీడియో చూడండి

లాక్ డౌన్ సందర్భంగా ఉద్యోగుల హాజరుతో పాటు ఇతర అంశాలపై తాజా మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు.

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ యథావిధిగా విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారు వాటిని తొలగించే వరకూ ఇంట్లోనే ఉండి పని చేయాలని సూచించారు.

Content above bottom navigation