ఏపీ కరోనా అలర్ట్: 502కు చేరిన పాజిటివ్ కేసులు.

దేశంలో కేసుల సంఖ్య మ‌రింత పెరుగుతోంది, రెండు తెలుగు స్టేట్స్ లో కూడా కేసులు పెరుగుతున్నాయి…ఏపీలో వైర‌స్ పాజిటవ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బుధవారం మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లా 4, కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. ఈ 19 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 502కు పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైర‌స్ తో 11మంది చనిపోయారు.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

Karnataka Man Dies at 76, Becomes India's First Coronavirus ...

రాష్ట్రంలో కేసుల్లో గుంటూరు జిల్లా 118 పాజిటివ్ కేసులతో టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇలా ఏపీలో నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

జిల్లాలవారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా – 118
కర్నూలు జిల్లా – 97
నెల్లూరు జిల్లా – 56
ప్రకాశం జిల్లా – 42
కృష్ణా జిల్లా -45
కడప జిల్లా – 33
పశ్చిమ గోదావరి జిల్లా – 31
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా – 23
తూర్పుగోదావరి జిల్లా – 17
అనంతపురం జిల్లా -20
మొత్తం కేసులు -502

Content above bottom navigation