బంద్ లో రోడ్డు పై తిరుగుతున్న అమ్మాయి .. పోలీసులు ఏం చేసారో తెలుసా ?

132

దేశ ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. దీనికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యవసర వస్తువులు, మెడికల్ షాపులు తప్ప మిగిలినవన్నీ బంద్ చేశారు. ఈ క్రమంలో రోడ్లపైకి ఎవరూ రావడం లేదు. అందులో భాగంగా విజయవాడలో కూడా అదే పరిస్థితి నెలకొంది..


ఇక ఇదిలా ఉంటే విజయవాడ కోనేరు సెంటర్ లో ఓ యువతికి పోలీసులు అండగా నిలిచారు. అప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ యువతి ఇంటికి వెళ్లడానికి ఏలాంటి సౌకర్యం లేకపోవడంతో కంగారు పడుతుంది. ఇది గమనించిన ఎఎస్పి మోకా సత్తిబాబు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఎక్కడికి వెళ్లాలో ఆమె వివరాలు అడిగి తెలుసుకొని దగ్గరుండి పోలీసు వాహనంలో ఎక్కించి, సెక్యూరిటీనీ ఇచ్చి పంపించి ఇంటిదగ్గర దింపమని ఆదేశించారు. అంతేకాకుండా పక్కనే ఉన్న మరో యువకుడికి ఇదే పరిస్థితి ఎదురుకావడంతో అతని బైక్ పైన ఇంటి దగ్గర దించాలని ఆదేశించారు.

Image result for poloce


ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు ఏపీ పోలీసులపై మరింత గౌరవం పెరిగింది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.


హైదరాబాద్‌ను చుట్టేసిన 69వేల మంది విదేశీ ప్రయాణికులు

జబర్దస్త్ లో రియల్ ఫైట్… కొట్టుకున్న భాస్కర్, అప్పారావు ..

కరోనా వైరస్ జీవిత కాలం ఎంత? ఎన్ని రోజులు ?Content above bottom navigation