విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో.. అనంతగిరి మండలం డముకులో 5వ నంబర్ మలుపు వద్ద శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో దాదాపు 30మంది ప్రయాణికులతో వెళ్తోన్న దినేష్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. సుమారు 300 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం