మారుతీరావు గురించి వైశ్య భవన్ మేనేజర్ ఏమన్నారంటే..!

179

తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ ప్రణయ్ హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, సెప్టెంబ‌ర్ 14న ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు. అంతే కాకుండా తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ప్రకటించాడు. మారుతీరావు 7 నెలలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదల బయట తిరుగుతున్నారు.అయితే ఇప్పుడు ఈ కేసులో మరొక ట్విస్ట్ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావు ఆత్మహత్య సంచలనంగా మారింది.

కాగా మారుతీరావు గురించి ఆర్య వైశ్య భవన్ మేనేజర్ మల్లికార్జున్ పలు విషయాలు వెల్లడించారు. హైదరాబాద్‌ కి ఎప్పుడు వచ్చినా మారుతీ రావు ఇక్కడే ఉండేవాడని.. ఆయన కుమార్తె చదువుకునే సమయంలోనూ చాలాసార్లు ఇక్కడికి వచ్చేవాడని మల్లికార్జున్ తెలిపారు. కూతురు అంటే మారుతీరావుకు చాలా ఇష్టం. బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూతురు గురించి తలుచుకుని బాధపడేవాడు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆర్య వైశ్య భవన్‌లో మారుతీ రావును ఆయన డ్రైవర్ వచ్చి వదిలి వెళ్లారని ఆయన చెప్పారు. ఉదయం 8గంటలకు డోర్ తట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించామని, పోలీసులతో పాటు మారుతీ రావు వ్యక్తిగత డ్రైవర్‌కు కూడా సమాచారం ఇచ్చామని మల్లికార్జున్ పేర్కొన్నారు. పోలీసులు వచ్చి చూసే సరికి మారుతీ రావు బెడ్‌పై పడి ఉన్నాడని, ఆయన రూమ్‌లో పాయిజన్ బాటిల్ దొరికిందని వెల్లడించారు. సూసైడ్ నోట్‌లో తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లిపో అని రాసి ఉందన్న విషయాన్ని మల్లికార్జున్ తెలిపారు.

Maruthi Rao suicide, మారుతీరావు గురించి వైశ్య భవన్ మేనేజర్ ఏమన్నారంటే..!

ప్రణయ్ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈలోగా మారుతీరావు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. మారుతీరావు భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసుల ఒత్తిడితోనే ఆయన చనిపోయినట్లు మారుతీరావు భార్య అంటున్నారు. ఇక మారుతీరావు ఆత్మహత్య విషయం గురించి ఆయన కూతురు అమృతను అడిగితే మాత్రం.. తనకు అసలు ఈ విషయం గురించి తెలియదని.. అసలు అతను ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియదని ఆమె తెలిపింది. వరుస పోలీస్ కేసులు, సోదరుడితో ఆస్తి వివాదాలు, కుమార్తె దూరమవడంతో మారుతీరావు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Content above bottom navigation