క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు ఓ ఆటో డ్రైవర్ సాయం చేశాడు. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో జరిగినా అదిప్పుడు వెలుగులోకి వచ్చింది. సచిన్ బుధవారం తన సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పంచుకొని ఆ విషయాన్ని వెల్లడించాడు. అసలేం జరిగిందంటే.. జనవరిలో లిటిల్ మాస్టర్ ముంబయిలోని సబర్బన్ వీధుల్లో తన కారులో ప్రయాణిస్తూ ప్రధాన రహదారికి చేరుకునే మార్గాన్ని మర్చిపోయాడు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం