వాలెంటైన్స్ డే : భయంతో వ‌ణుకుతున్న హైదరాబాద్‌ ప్రేమ జంట‌లు.. ఎందుకో తెలుసా..?

108

ఫిబ్రవరి నెల అంటేనే అందరికి గుర్తు వచ్చేది వాలెంటైన్స్ డే. ఫిబ్రవరి 14 అంటే లవర్స్ కి ఎంతో ఇష్టం. ప్రేమికుల రోజున ప్రేమికులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ‘వాలెంటైన్స్ డే’ రోజున ఎంతగానో ప్రేమించే వ్యక్తికి తమ ప్రేమ గురించి చెప్పాలనుకుంటారు. అందుకే ప్రేమ పక్షులకు అత్యంత ఇష్టమైన రోజు ఇదే. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపంచం వ్యాప్తంగా ప్రేమ జంటలు పండుగ చేసుకుంటున్నాయి. అయితే, ‘వాలెంటైన్స్ డే’ని గ్రాండ్‌ గా జరుపుకోవాలనుకుంటోన్న తెలంగాణ ప్రేమ జంటలకు ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. ఆ భయం పేరే భజరంగ్ దళ్. ప్రేమలో మునిగితేలుతోన్న తమను పట్టుకుని, పెళ్లి చేస్తారేమోనని ప్రేమికులు వణికిపోతున్నారు.

Image result for valentines day

ఒకప్పుడు ప్రేమ అనే పరీక్షా రాసి, వేచి ఉన్న విద్యార్థిని అనే పాట పాడే వాళ్ళు అబ్బాయిలు, కానీ ప్రేమికుల రోజున ఆ ప్రేమ పరీక్ష రాయాలంటేనే భయపడుతున్నారు, అందుకు కారణం బజరంగ్ దళ్. వాళ్ళకు దొరికితే కుమ్ముడు, పెళ్లి, పరుగు.. ఒకటా రెండా ఎన్నో జరుగుతాయి. బజరంగ్ దళ్ అంటే సామాన్యులకు సంతోషం, ప్రేమికులకు మాత్రం దుఃఖం. ఆ రోజు బజరంగ్ దళ్ చేతికి దొరికితే ఇక అంతేసంగతి. వద్దు అన్న అని మొరపెట్టుకుంటారు కొందరు, మరికొందరు అయితే మేము అన్నాచెలెళ్లము అని ఏవేవో సాకులు చెబుతారు, అయినా కానీ చివరికి ఏదో ఒక రకంగా బజరంగ్ దళ్ చేతిలో బుక్కవుతారు. లాస్ట్ ఇయర్ చాలామందికి పెళ్లిళ్లు చేసి సక్సెస్ అయ్యారు భజరంగ్ దళ్ వాళ్ళు. అయితే సారిమాత్రం అలా జరగకూడదు అని కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి.

ఈ క్రింద వీడియో చూడండి:

భజరంగ్ దళ్ వాళ్ళు చేసే విషయాలను ప్రస్తావిస్తూ మానవ హక్కుల కమిషన్‌ లో ఓ పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణలో ప్రేమికుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆల్‌ ఇండియా దళిత, క్రైస్తవ సంఘాల సమాఖ్య, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రేమించుకుంటోన్న వారికి రక్షణ కల్పించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌లో ఓ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీంతో పోలీసులు మాత్రం ఫిబ్రవరి 14 న ఎవరైనా బజరంగ్ దళ్ వాళ్ళు అల్లర్లు సృష్టిస్తే వారిని అరెస్ట్ చేస్తాం అని తెలిపారు. ఉత్తరాదిన బజరంగ్ దళ్ ప్రేమికుల రోజు ప్రేమికులను కొట్టేది, ఎక్కడ పడితే అక్కడ బాదడం లాంటివి చేస్తుంటారు, ఇలా హింస కార్యక్రమాలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పట్టణాల్లో బజరంగ్ దళ్ ప్రభావం ఎక్కువగా ఉండదు, కానీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి సిటీ లలో బజరంగ్ దళ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పార్క్ లలో ఎక్కువగా ఉంటుంది. అయితే దీని మీద భజరంగ్ దళ్ వాళ్ళు మాట్లాడుతూ.. ఫారిన్ సంప్రదాయం అయిన వాలెంటైన్స్ డే ని మనదేశంలో జరుపుకోకూడదు అనేదే మా ముఖ్య ఉద్దేశం అని కొందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు చెబుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation