ఆ 5 కోట్లు ఏమయ్యాయి..చిరు సమాదానం తెలిస్తే షాక్

87

గత కొన్ని రోజులుగా బాలకృష్ణ- చిరంజీవి ఇష్యూ తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవి, ఇతర సినీ పెద్దలంతా కలిసి తెలంగాణ ప్రభుత్వంలో జరిపిన చర్చలకు తనను పిలవలేదంటూ ఫైర్ అయిన బాలకృష్ణ..

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

అంతటితో ఆగక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ విషయమై ఆ ఐదు కోట్లు ఏమయ్యాయి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ మాటలకు నొచ్చుకున్న చిరంజీవి ఓ డిసీజన్‌కి వచ్చారని తెలుస్తోంది.

కరోనా కష్టకాలంలో సీసీసీ (కరోనా క్రైసిస్ కమిటీ) ఏర్పాటు చేసి చిత్ర వర్గాల సహకారంతో సినీ కార్మికులకు అండగా నిలిచిన చిరంజీవి.. ఆ తర్వాత షూటింగ్స్ రీ ఓపెన్ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సహా పలువురు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.

అయితే ఉన్నట్టుండి సడెన్‌గా తనను ఆ మీటింగ్‌కి పిలవలేదంటూ బ్లాస్ట్ అయిన బాలకృష్ణ, వాళ్లంతా కలిసి భూములు పంచుకుంటున్నారా? అని కామెంట్ చేయడం వివాదానికి తెరలేపింది. ఆ వెంటనే ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇండస్ట్రీకి చెందిన కొందరిని టార్గెట్ చేస్తూ బాలకృష్ణ మరో ఇష్యూని లేవనెత్తడంతో దీనిపై చర్చలు ముదిరాయి.

Content above bottom navigation