పెళ్లికి ముందే సహజీవనం… ఊహించని మలుపు తిరిగిన వ్యవహారం

ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు…. పెళ్లి చేసుకుందామనుకున్నారు..కొన్ని రోజుల తర్వాత పెద్దల అంగీకారం కూడా కుదిరింది.. అయితే ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా పెళ్ళికి ముందే కలిసి జీవిస్తే తప్పేంటి అని అనుకున్నారు. అందుకున్నదే తడువుగా కొద్ది నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఆ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు పాడే ఎక్కాడు. ఇంతకు రోహిత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. అసలు ఏమైంది.. రోహిత్ చనిపోడానికి అతని ప్రియురాలు కారణమా? అసలేమైంది..

విశాఖపట్నం జీవీఎంసీ పరిధి 40వ వార్డులోని హుస్సేన్‌ నగర్‌కు చెందిన విరీత్‌ రోహిత్‌ పంజాబ్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇతనికి గతంలో విశాఖపట్నం నగరంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలో ఒక యువతీ పరిచయం అయ్యింది. అయితే బిటెక్ లో వచ్చిన తర్వాత ఇద్దరు విడిపోయారు. అయితే ఈ మధ్యనే ఫేస్ బుక్ లో ఆ యువతీ తారసపడింది. అలా పాత స్నేహం మళ్ళి చిగురించింది. కొన్నిరోజులకు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని విశాఖపట్నం మొత్తం తిరిగారు. ఒకరు లేకుంటే మరొకరు లేనంతగా ప్రేమించుకున్నారు. అయితే ఈ ఇద్దరి వ్యవహారం కొన్నిరోజులకు ఇంట్లో వాళ్లకు తెలిసింది. ముందు వద్దని చెప్పినా, ఇద్డు ప్రేమికులు వినిపించుకోకపోవడంతో వీరి పెళ్ళికి ఓకే చెప్పారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇక సమస్య లేదని ఇద్దరు అనుకున్నారు. అయితే ముందు ఉద్యోగం సంపాదించి, స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. దానికి ప్రేమికులు కూడా ఒకే అన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

అయితే ఎలాగూ పెళ్లి చేసుకుంటామని భావించిన వీరిద్దరూ మురళీనగర్‌ ఎన్జీజీవోఎస్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం సాగిస్తున్నారు. యువతి నగరంలోని ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తుండగా రోహిత్‌ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా కూడా రోహిత్ కు ఉద్యోగం రావడం లేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కలిసి ఉండడంతో రోజు గొడవలు జరిగేవి. అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అబ్బాయేమో ఖాళీగా ఉన్నాడు. ఈ విషయం గురించే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ గురువారం రోజు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో రోహిత్ తనకు వాల్యూ లేదని భావించి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. గురువారం యువతి విధులకు వెళ్లిపోగా, మధ్యాహ్నం రోహిత్‌ ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీర బిగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. రోహిత్ లో మార్పు వస్తుందని భావించి అతనితో కొంత రాష్ గా మాట్లాడినా కానీ, ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని కలలో కూడా ఊహించలేదని ఆ ప్రేయసి కన్నీటి పర్యంతం అవుతుంది. కంచరపాలెం పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ బి.లోకేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation