కరోనా తెచ్చిన అదృష్టం.. ఒక్క రాత్రిలో అతడి జీవితమే మారిపోయింది

243

అతడో కార్పెంటర్. పేరు ఇజారుల్. అతడు పశ్చిమ బెంగాల్ వాసి అయినప్పటికీ బతుకు తెరువు కోసం కేరళ బాట పట్టాడు. అతడిది పని దొరికితేనే కానీ పూట గడవని పరిస్థితి. బెంగాల్‌లొ అతడు రోజుకు 500 మాత్రమే సంపాదించేవాడు. కానీ కేరళలో దీనికి రెట్టింపు సంపాదన వస్తుందని తెలిసి అక్కడకు వెళ్లాడు. అయితే ఇటీవల కేరళలో కరోనా ప్రబలడంతో అతడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని  స్వరాష్ట్రానికి చేరుకున్నాడు. కానీ అతడికి ఇంటి దగ్గర పనిదొరకకపోవడంతో అప్పటి వరకూ కుడబెట్టుకున్న సంపాదన మీదే బతుకు ఈడుస్తున్నాడు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

అయితే చేతిలో డబ్బు క్రమంగా అయిపోతుండటంతో అతడిలో కంగారు మొదలైంది. ఏం చేయాలో తెలీక ఇటీవల అతడు ఓ లాటరీ టిక్కెట్టు కొన్నాడు. అంతే.. మరుసటి రోజు కల్లా అతడి జీవితం సమూలంగా మారిపోయింది. తెల్లారేసరి కల్లా తాను కోటీస్వరుడైపోయానని తెలిసి అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డబ్బు సంపాదన కోసం ఇక నుంచి కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదంటూ అతడు ఉబ్బితబ్బిబైపోయాడు. తన కుమారులను మంచి చదువులు చదివిస్తానని, మంచి ఇల్లు కట్టుకోవడంతో పాటూ సొంతంగా వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తానని అతడు స్థానిక మీడియాకు చెప్పాడు.  అయితే గతంలో కేరళ వరదల సమయంలోనూ అతడు ఇలాగే  ప్రాణాలు అరిచేత పెట్టుకుని స్వరాష్ట్రానికి తిరిగొచ్చాడు. ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగినప్పటికీ కరోనా వైరస్ రూపంలో అతడికి అదృష్టం కలిసొచ్చింది. రాత్రికి రాత్రే 

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

Content above bottom navigation