తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఈ సారి కొంత లేటైనా ఇప్పుడే అసలైన ఎంటర్ టైన్మెంట్ మొదలైంది. పోయిన వారం సూర్య కిరణ్ ఎలిమినేషన్ అయ్యాడు. అయితే షో ప్రారంభమైన వారం రోజులకే బిగ్బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బయటకు తీశారు. అందులో భాగంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా “ఈరోజుల్లో” బస్టాప్ ఫేమ్ సాయి కుమార్ హౌజ్’లోకి వచ్చాడు.
ఇది కూడా చదవండి: మా వ్యాక్సిన్ ప్రమాదకరమే కాని, రష్యా సంచలన ప్రకటన
ఓ ప్రేమకథ కూడా స్టార్ట్ అయ్యింది. అభిజిత్, అఖిల్, మునాల్..ల ముక్కోణపు ప్రేమకథ ఆసక్తి కరంగా సాగుతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ కి ఏకంగా 9 మందిని నామినేట్ చేశారు. ఇక రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రానుందని తెలుస్తోంది. అందులో భాగంగా తాజా ప్రోమోలో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: ఉచితంగా కరోనా వ్యాక్సిన్… ట్రంప్ సంచలన నిర్ణయం..
అంతేకాదు ఆ వ్యక్తి తనను తాను జోకర్ గా పరిచయం చేసుకున్నాడు. దీంతో జబర్దస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈరోజుల్లో ఫేమ్ సాయి కుమార్ మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.