BlueWhale కన్నా డేంజర్ గా మారిన Tiktok చాలెంజ్..ఎంతమంది చనిపోయారో తెలుసా?

92

TikTok… యువత మనసు దోచేసిన వీడియో షేరింగ్ యాప్ ఇది. కుర్రాళ్లలో టిక్ టాక్ యాప్ గురించి తెలియని వాళ్లుండరు. సాదారణంగ ఇప్పుడు ప్రతి ఒక్కరు టిక్ టాక్ ని ఉపయోగిస్తున్నారు. ఇందులో చాలా వరకు మంచి మంచి వీడియోస్ ని అప్లోడ్ చేసి అభిమానులను అలరిస్తూ ఉంటారు. అయితే టిక్ టాక్ లో ఓ ప్రమాదకరమైన చాలెంజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రిప్పింగ్ జంప్, స్కల్ బ్రేకర్ అని చాలెంజ్ కు పేర్లు కూడా పెట్టారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ చాలెంజ్ స్కూల్ యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ చాలెంజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు టిక్ టాక్ లో అంతలా ఫెమస్ అయినా ఛాలెంజ్ ఏమిటంటే.. ఈ చాలెంజ్ లో ముగ్గురు పక్కపక్కనే నిలుచుని ఉంటారు. మధ్యలో ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగరగానే పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరిన వ్యక్తి కాళ్లను ముందుకు తంతారు. దీంతో మధ్యలో ఉన్న వ్యక్తి కింద పడిపోతాడు. దాంతో అతని తల వెనకభాగం డైరెక్ట్ గా నేలకు తాకే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీనికి స్కల్ బ్రేకర్ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మెక్సికోలోని ఓ స్కూల్లో జరిగినట్లు చెబుతున్న ఓ సంఘటనకు చెందిన వీడియో మరింత భయంకరంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఛాలెంజ్ చేస్తూ ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్టు సమాచారం. దీంతో యూరోప్, దక్షిణ అమెరికాకు చెందిన కొన్ని స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థులకు దీనికి సంబంధించిన సూచనలు జారీ చేశారు. ఈ తరహా చాలెంజ్ లకు సంబంధించిన వీడియోలు చేస్తే చర్యలు తప్పవని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని దేశాల్లో అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అసలు ఈ చాలెంజ్ ఎక్కడనుంచి ప్రారంభమైందో తెలుసుకుని వారి మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ చాలెంజ్ చేస్తే శరీరానికి తీవ్ర ప్రమాదం అని వైద్యులు అంటున్నారు. మీ శరీరంలో ఉన్న ప్రతి కీలుపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ చాలెంజ్ లో పాల్గొనేవారి నడుము కింది భాగం నేలను నేరుగా తాకుతుందని, అంతేకాకుండా మోకాలు, మడమ వీటికి కూడా గాయాలయ్యే అవకాశం ఉందంటున్నారు. తల నేరుగా నేలకు తగిలి బలమైన గాయమైతే ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. ఈ చాలెంజ్ ప్రస్తుతం వాట్సాప్ లో కూడా వేగంగా విస్తరిస్తుంది. అయితే అదృష్టవశాత్తూ ఇది తల్లిదండ్రులకు ఒక వరంలా ఉపయోగపడి, వారి పిల్లలు దీని బారిన పడకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి మనదేశంలో దీనికి సంబంధించిన వీడియోలు ఏవీ వెలుగులోకి రాలేదు. అయితే ఎందుకన్నా మంచిది ఇటువంటి ప్రమాదకరమైన చాలెంజ్ ల గురించి పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే టిక్ టాక్ లో కేవలం ఈ చాలెంజ్ మాత్రమే కాకుండా మరిన్ని చాలెంజ్ లు కూడా సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తున్నాయి. అవే టిక్ టాక్ అవుట్ లెట్ చాలెంజ్, బ్రైట్ ఐ చాలెంజ్. కాబట్టి టిక్ టాక్ లు ఎక్కువగా చేసేవారు, ముఖ్యంగా యువత దీని బారిన పడకుండా ఉంటే మంచిది.

Content above bottom navigation