54 అయస్కాంతాలను మింగిన బాలుడు.. పొరపాటు కాదు, ప్రయోగం, షాకైన డాక్టర్లు!

830

కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే షాక్ కి గురికాకతప్పదు. అలాంటి ఒక ఘటన గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒక పన్నెండేళ్ల బాలుడు అయస్కాంతాలను మింగాడు. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 54 మాగ్నెటిక్ బాల్స్ ని మింగాడు. అన్ని బాల్సా , ఏమైనా అయ్యిందా అని కంగారుపడకండి. డాక్టర్స్ ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి అతడిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే…

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

యూకే దేశంలో ఒక 12 ఏళ్ల రిలే మారిసన్ అనే బాలుడు స్కూల్ లో అయస్కాంతం’ పాఠం విన్నాడు. ఆ పాఠం విన్న తర్వాత ఆ బాలుడు తనలో తానే అనేక ప్రశ్నలు వేసుకున్నాడు. అయస్కాంతం ఎలా పనిచేస్తుంది? పెద్ద పెద్ద వస్తువులను కూడా తన వైపునకు ఏవిధంగా లాగేసుకుంటుంది? అసలు మన శరీరంలో ఒక పెద్ద అయస్కాంతం ఉంటే ప్లేట్ల లాంటి వాటిని పట్టుకునే అవసరం ఉండదు కదా..! చిన్న ఏర్పాటు చేసుకుంటే బ్యాగులను వీపునకు తగిలించుకునే అవసరం ఉండదు కదా..

అయస్కాంతం ప్రభావానికి అదే వీపును అంటిపెట్టుకొని ఉంటుంది కదా.. ‘ ఇలా మారిసన్‌ తనలో తానూ అనేక ప్రశ్నలు వేసుకున్నాడు. ప్రశ్నలు వేసుకోవడంతోనే మారిసన్ ఆగలేదు. దాన్ని ప్రయోగాత్మకంగా చూద్దామనుకున్నాడు. అందుకోసం మాగ్నెటిక్ బాల్స్ మింగాడు. జనవరి 1న మొదటి దశలో కొన్ని మాగ్నెటిక్ బాల్స్, జనవరి 4న రెండో విడత మరిన్ని అయస్కాంతాలను మింగాడు. ఆ తర్వాత అవి ఎలా పనిచేస్తాయో చూద్దామనుకున్నాడు. చివరికి కడుపులో నుంచి ఏ కలర్‌తో బయటకు వస్తాయో తెలుసుకుందామనుకున్నాడు.

కానీ, సీన్ రివర్స్ అయింది. 54 బాల్స్ మింగడంతో కడుపులో గందరగోళం మొదలైంది. ఇక భరించలేని దశలో తన తల్లి వద్దకు వెళ్లి పొరపాటున అయస్కాంతాలను మింగానని చెప్పాడు. కుమారుడి అవస్థ చూసి ఆందోళనకు గురైన ఆ తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. స్కానింగ్‌ చేయించి బాలుడి కడుపులో ఏం ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు వైద్యులు. 20 నుంచి 30 వరకు చిన్న చిన్న అయస్కాంతాలు ఉన్నట్లు భావించారు. నిపుణులైన డాక్టర్ల బృందం ఆ బాలుడికి ఎమర్జెన్సీ శస్త్రచికిత్స నిర్వహించింది. కడుపులో నుంచి ఒక్కో మాగ్నెటిక్ బాల్ బయటకి తీశారు. అందుకు 6 గంటల సమయం పట్టింది.

బాలుడి కడుపులో నుంచి మాగ్నెటిక్ బాల్స్ అన్నీ తీసినట్లు నిర్ధారించుకున్నాక వాటిని లెక్కించారు. అవి మొత్తం 54 ఉండటంతో నోరెళ్లబెట్టారు. అది పొరపాటున మింగినవి కావని భావించిన డాక్టర్లు ‘ఏం జరిగింది బాబూ..’ అని బాలుడిని ప్రశ్నించారు. అప్పుడు అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యానికి గురయ్యారు. వాటిని బయటకు తీయడం ఏమాత్రం ఆలస్యమైనా బాలుడి విసర్జక వ్యవస్థ, ఇతర అవయవాలు దెబ్బతిని ప్రాణాలు పోయే ప్రమాదం ఉండేదట.

ఈ ఘటన గురించి ఆ బాలుడి తల్లి మాట్లాడుతూ.. ‘నా కుమారుడు క్రేజీ గయ్.. సైన్స్ పట్ల వాడికి ఆసక్తి ఎక్కువ. ఎప్పుడూ వస్తువులతో ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ, వాడు ఇంత పని చేస్తాడని కలలో కూడా ఊహించలేదు..’ అని అన్నారు. ‘మాగ్నెట్స్‌ ను నా కడుపులో చొప్పించడానికి ప్రయత్నం చేశా. కడుపులో అయస్కాంత శక్తి ఉంటే.. ఈ కాపర్‌ నా పిరుదులకు అంటిపెట్టుకొని ఉంటుందేమో చూద్దామనుకున్నా..’ అని మారిసన్ తనతో చెప్పాడని అతడి తల్లి తెలిపారు.

Content above bottom navigation