బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందా తిరుమల మరో వింత….

115

హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామీ వేంచేసిన తిరుమల పరమ పుణ్య పవిత్ర క్షేత్రం . ప్రపంచంలోని అన్ని మతాల వారు ఆ దేవ దేవుని భక్తీ ప్రపత్తులతో కొలుస్తున్న తీరు ఆ స్వామీ మహత్యానికి నిదర్శనం. ఇక ఇప్పుడు కోవిడ్ 19 కారణంగా తిరుమలకు భక్తులను ఎవరిని కూడా వెళ్లనీవడం లేదు. దాంతో తిరుమల వీధుల్లో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. నిన్న తిరుమల శ్రీవారి ఆలయం ముందు పందులు సంచరించాయి. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో వరాహాల మంది తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి తమ ఇష్టానుసారం పరుగులు పెడుతున్నాయి. అక్కడ ఉన్న టీటీడీ అధికారులు గమనించకపోవడం భక్తులు విస్తుపోయేలా చేసింది. ఏడు పందుల మంద ఒకటి బేడీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి మెట్లు దిగి కిందకు వచ్చి, ఆయన మందు వరకూ వెళ్లి, అక్కడి నుంచి దక్షిణ మాడవీధిలోకి పరుగులు పెట్టాయి.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

Video : తిరుమలలో పంది సంచారం... దేనికి ...

అత్యంత పవిత్రంగా భావించే తిరుమాడ వీధుల్లో ఇవి తిరగడం భక్తులందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా భక్తులను ఇక్కడ చెప్పులతో తిరగనివ్వరు. అలాంటి చోట పందులు తిరగడంపై అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. టీటీడీ నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. బేడీ ఆంజయనేయ స్వామి ఆలయం ముందు నుంచి దక్షిణ మాడ వీధుల్లోకి వచ్చినట్టు చెబుతున్నారు భక్తులు. ఇక దీని గురించి కొందరు భక్తులు స్పందిస్తూ.. ఇలా జరుగుతుందని కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఎప్పుడో చెప్పాడని కొందరు అంటున్నారు. ఇది కలియుగాంతానికి సంకేతం అని కొందరు అంటున్నారు. తిరుపతి మాడవీధుల్లో పంది సంచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

బ్రహ్మంగారి పేరు మీద పబ్బం గడుపుకునే కొంతమంది బ్యాచ్, ఇది కూడా బ్రహ్మం గారి కాలజ్ఞానం మహిమే అని చెబుతున్నారు. అయితే ఈ వాదన మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మార్కెట్ లో జనాలున్నపుడే పందులు తిరగడం సర్వసాధారణమని, అలాంటిది ప్రస్తుతం కాగాళీగా ఉన్న వీధుల్లో అడవి పంది తిరగడంతో వింతేముందని అంటున్నారు. తిరుమలలో వన్య ప్రాణుల సంచారం ఈ రోజేం కొత్తగా జరుగుతున్నది కాదు. పులులు తిరిగే ప్రాంతం అది, అక్కడ ఒక అడవి పంది సంచారం మామూలే అని అంటున్నారు. కానీ భక్తులు మాత్రం ఇది చెడుకు సంకేతం అని అంటున్నారు.

Content above bottom navigation