breakingnews : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఈ మధ్య మనం ఎక్కువ వింటున్న వార్తలలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా ప్రజ్నాపూర్, కరీంనగర్ జిల్లా మానుకొండూరు… ప్రాంతమేదైనా, కారణమేదైనా రహదారులు మాత్రం రక్తాన్ని చిందిస్తున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపటం, రహదారుల రూల్స్ పాటించకపోవటం వంటి పలు కారణాలు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇటువంటి ఘటనల్లో అమాయకులు కూడా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళి అలాంటి ఘోరా రోడ్డు ప్రమాదమే ఒకటి చోటుచేసుకుంది.

ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపుడి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. నర్సారావు పేట నుంచి పుట్టకోట గ్రామానికి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా కూడా నర్సరావుపేట సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురిని పుట్టకోట గ్రామానికి చెందిన రమాదేవి, మణికంఠ, యశస్వినిగా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇటు అనంతపురం జిల్లా కూడేరు మండలం మద్దాలపురం దగ్గర మరో ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. మృతులు మరుట్లకు చెందిన సోమనాథ్‌, స్వాతి, ఉరవకొండ మండలం రాకెట్లకు చెందిన రమాదేవిగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు..మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆరా తీశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడినవారికి చికిత్స అందించేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. చూశారుగా ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో.ఇప్పటికైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త రూల్స్ పాటించి ప్రమాదాలను అరికట్టండి.

Content above bottom navigation