breakingnews : కత్తి మహేశ్ పై కేసు నమోదు.. ఈసారి ఏం చేశాడంటే..?

నిత్యం వివాదాల్లో ఉండే వ్యక్తుల్లో కత్తి మహేశ్ ఒకరు. సినీ క్రిటిక్ గానూ.. విమర్శకుడిగా.. నటుడిగా.. దర్శకుడిగా.. ఇలా కత్తి మహేశ్ లో అనేక కోణాలున్నాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆయన కాంట్రావర్సీ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయడం ద్వారా కత్తి మహేశ్ పాపులర్ అయ్యారనే చెప్పాలి. అలాగే బిగ్ బాస్ లోనూ కంటెస్టెంట్ గా సెలక్ట్ కావడంతో కత్తి మహేశ్ కూడా సెలబ్రెటీ అయ్యాడు. అయితే తరచూ వివాదాల్లో ఉండే కత్తి మహేశ్ ఈసారి చాలా సున్నితమైన అంశంలో వివాదాస్పదుడయ్యాడు. మతపరమైన ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్లు చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఆయన ఈసారి చేసిందేమిటంటే.. హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడిని ఉద్దేశించి మహేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Image result for kathi mahesh

శ్రీ రాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలను కత్తి మహేష్ దెబ్బతీశారంటూ అడ్వకేట్ కె. కరుణ సాగర్ కత్తి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు క్రైమ్ నెం: 196/2020 u / s 506,507-IPC కింద కత్తి మహేష్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే కత్తి మహేష్ మీద ఉమేష్ కుమార్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద ఐపీసీ సెక్షన్ 505(1)(c), సెక్షన్ 502 (2) కింద కేసు నమోదు చేశారు. హిందు దేవుళ్లు, హిందు మతాన్ని కించపరిచే విధంగా కత్తి మహేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఉమేష్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా అడ్వొకేట్, హింధు సంఘటన్ అధ్యక్షుడు కరుణాసాగర్ కూడా అవే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మీటింగ్‌‌ను ఉద్దేశించి కత్తి మహేష్ మాట్లాడుతూ హిందు దేవతలను కించపరిచేలా వ్యవహరించారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ కోరారు.

Image result for kathi mahesh

గతంలో కూడా కత్తి మహేష్ రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని వివాదాల కారణంగా అతడిని పోలీసులు కొన్ని రోజుల పాటు నగరం నుంచి బహిష్కరించారు. అలా కొన్ని రోజులు వివాదాలకు దూరంగా ఉన్న కత్తి మహేష్ ఇప్పుడు మళ్ళి మతపరమైన కామెంట్స్ చేసి వివాదాల్లో ఇరుకుంటున్నాడు. చూడాలి మరి ఈ కేసు చివరకు ఎన్ని మలుపులు తీసుకుంటుందో.. వివాదాలే ఇప్పుడు సరికొత్త పాపులారిటీకి కొలమానాలు అవుతున్నాయనడానికి ఈ కత్తి మహేశ్ ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation