breakingnews : టి20 వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్ కు కోహ్లీ గుడ్‌ బై..?

63

విరాట్ కోహ్లి. చేజింగ్ వీరుడు. ఇండియ‌న్స్‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. అంతేకాదు, అంత‌ర్జాతీయంగా కూడా విరాట్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలుసు. క్రికెట్ లో అవతలి టీమ్ లో ఎవరున్నా సరే, సెంచరీలు కొట్టే ఈ బ్యాట్స్ మాన్ కి వ్యక్తిగతంగా కూడా అభిమానులున్నారు. ఎందుకంటే మంచి హృదయం ఉన్నవాడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కారణం. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతోఇష్టం చూపిస్తూ, శ్రద్ధ పెట్టడం వల్లనే ఇప్పుడు నెంబర్ పొజిషన్ కి వచ్చాడు. ప్రిన్స్ ఆఫ్ ది క్రికెట్ గా ఇతడిని వ్యవహరిస్తుంటారు. సచిన్ తర్వాత మరొక సచిన్ అనే పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్ లో ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులార్టీ సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు.

అయితే పూర్తీగా క్రికెట్ కు రిటైర్మెంట్ అని పొరబడకండి. కోహ్లీ టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు? టీమిండియా బిజీ షెడ్యూల్‌పై ఇటీవల పెదవి విరిచిన కోహ్లీ 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు ఫార్మాట్లలో మాత్రమే క్రికెట్ ఆడతానని ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుండగా మీడియా సమావేశంలో రిటైర్మెంట్‌పై కోహ్లీ మాట్లాడాడు. ‘‘విరాట్ కోహ్లీ 2021లో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత ఏదైనా ఒక ఫార్మాట్‌లో తప్పుకునే ఆలోచన ఏమైనా ఉందా..?’’ అని మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి విరాట్ కోహ్లీ సమాధానమిస్తూ ‘2023 వరకూ అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత ఒకసారి పునరాలోచించుకుంటాను. ఎందుకంటే.. గత ఎనిమిదేళ్లుగా ఏడాదిలో కనీసం 300 రోజులు క్రికెట్‌ కోసం కేటాయిస్తున్నాను. అయితే.. బిజీ షెడ్యూల్ కారణంగా మేము కూడా వ్యక్తిగతంగా కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాం. కానీ.. మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకి అది సాధ్యం కావడం లేదు. మరోవైపు టీమ్ నా నుంచి గెలిపించే ప్రదర్శన ఆశిస్తోంది. కాబట్టి.. మరో మూడేళ్లు (2023 వన్డే ప్రపంచకప్) వరకూ మూడు ఫార్మాట్లలో ఆడతాను. ఆ తర్వాత ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తా’ అని వెల్లడించాడు.

Image result for kohli

ఇలా కోహ్లీ చేసిన కామెంట్స్ ను బట్టి చుస్తే 2023 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ టి20 క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు అని అర్థం అవుతుంది. 2008, ఆగస్టులో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 248 వన్డేలు, 84 టెస్టులు, 81 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 70 అంతర్జాతీయ శతకాలు బాదిన కోహ్లీ.. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ టీ20ల్లో మాత్రం ఈ భారత కెప్టెన్ ఇటీవల పదో స్థానానికి పడిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ వన్డే, టెస్టుల్లో కొనసాగుతూ.. టీ20లకి మాత్రం రిటైర్మెంట్ ఇచ్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కోహ్లీ టి20 లను వదిలేస్తే కోహ్లీ లాగా టీమ్ ను నడిపించే కొత్త కెప్టెన్ కోసం భారత్ అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే భవిష్యత్ లో కెప్టెన్ అయ్యే లక్షణాలు ఏ ఒక్కరిలో కూడా లేవు. ఇప్పుడిప్పుడే క్రికెట్ లోకి వస్తున్నా వారిలో ఒక కొత్త కెప్టెన్ ను తయారుచెయ్యాల్సిన అవసరం ఉంది.

Content above bottom navigation