పెళ్లి పీటల మీదే గర్భవతి అయిన వధువు.. షాక్‌లో వరుడు

పెళ్లి పీటల మీదే వధువు గర్భవతి అయిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపింది. బీర్బుమ్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన సురేశ్(పేరు మార్చాం) అనే యువకుడితో రెండ్రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసిన వెంటనే వధువు తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయింది. పెళ్లికి వచ్చిన ఓ డాక్టర్ ఆమెను పరీక్షించి ఐదు నెలల గర్భవతి అని చెప్పడంతో అంతా షాకయ్యారు.

Image result for pregnancy

మూడుముళ్లు వేసి గంట గడవకముందే తన భార్య గర్భవతి అని తేలడంతో వరుడు షాక్‌లోకి వెళ్లిపోయాడు. తమను మోసం చేసి పెళ్లి చేశారంటూ వరుడి బంధువులు పెళ్లి కుమార్తె తరఫు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పెళ్లి మండపం కాస్తా రణరంగంగా మారింది. ఈ నిర్వాకంపై ఆరా తీయగా వధువు స్నేహితుడే ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేసినట్లు తేలింది. యువతి గర్భవతి అని తెలియగానే ఆ కామాంధుడు గ్రామం నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation