అక్కాతమ్ముడి ప్రేమాయణం…తరువాత ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లే.

మన సమాజం ఏం అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, మనుషులు బంధాలు, బంధుత్వాలు, వరుసలు మరిచిపోయారా… కొన్ని ఘటనలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే… వారిద్దరూ వరుసకు అక్కాతమ్ముడు అవుతారు. కానీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విషయం తెలుసుకున్న పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. దీంతో వారు ఇద్దరూ ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణమైన ఘటన వికారాబాద్ చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for lovers

కామునిపల్లి గ్రామానికి చెందిన మమత (20) వికారాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌ (19) ఆమెకు వరుసకు తమ్ముడు అవుతాడు. పదో తరగతి వరకు చదివిన ప్రశాంత్.. సెంట్రింగ్ పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట అతడు తల్లిదండ్రులతో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి నివాసం ఉంటున్నాడు. అయితే వరసకు అక్కా తమ్ముడైన మమత, ప్రశాంత్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరు అక్కాతమ్ములు అవుతారని తెలిసి కూడా ఒకరిని ఒకరు ప్రేమించారు. అయితే ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చేసిన ప్రశాంత్‌, తరచూ మమతతో ఫోన్లో మాట్లాడేవాడని తెలుస్తోంది. అయితే మమత 24 గంటలు ఫోన్ లో మాట్లాడడంతో కుటుంబ సభ్యులను అనుమానం వచ్చింది. అమ్మాయి ఫోన్ చెక్ చెయ్యగా ప్రశాంత్ తో ఎక్కువగా మాట్లాడుతున్నట్టు తెలిసింది. అయితే అక్కాతమ్ముళ్లే కాబట్టి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు ఏమి అనకపోవడంతో వీరిద్దరూ ఇక పగలూరాత్రీ అన్న తేడా లేకుండా ఫోన్ తోనే గడిపేవారు. అయితే కొన్ని రోజులకు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇది మంచి పద్ధతి కాదని నచ్చజెప్పారు. అయినా కూడా ఈ ప్రేమికులు మారలేదు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ నేపథ్యంలో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆందోళనతో వీరిద్దరూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రశాంత్ సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి కామునిపల్లి గ్రామానికి చేరుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున ప్రశాంత్, మమత ఇంట్లోనే ఇద్దరూ ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్ తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎంత పని చేశారని గుండెలు బాదుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఆ తరువాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation