అమ్మాయితో కండెక్టర్ అసభ్య ప్రవర్తన

127

ఓ ప్రయాణికురాలి పట్ల ఆర్టీసీ బస్సు కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టపగలే.. ఆ ప్రయాణికురాలి చెయ్యి పట్టుకుని మరీ వికృతంగా వ్యవహరించాడు. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. పలుమార్లు వారించినప్పటికీ.. అతను తన వైఖరిని మార్చుకోకపోవడంతో బాధిత మహిళ.. అతని వికృత చర్యలను తన సెల్ఫోన్లో బంధించింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో అతని పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. ఆ కండక్టర్ పేరు శశిహరి షాలూర్. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు డిపోలో పనిచేస్తున్నారు. పుత్తూరు నుంచి హసన్కు బయలుదేరిన బస్సులో విధి నిర్వహణలో ఉన్న సమయంలో అతను ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.

పుత్తూరులో బస్సు ఎక్కిన ఓ మహిళ హసన్ వరకు ప్రయాణించాల్సి ఉంది. ఆ సమయంలో బస్సులో పెద్దగా ప్రయాణికులు లేరు. బాధిత మహిళ ఒంటరిగా ఉండటంతో ఆమె పక్కనే కూర్చున్నాడా కండక్టర్. ఆమెతో మాటలు కలిపాడు. ఒంటి మీద చేతులు వేస్తూ. అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఆమె వారించే ప్రయత్నం చేసినప్పటికీ.. వినిపించుకోలేదా కండక్టర్. వినీ విననట్లు నటించాడు. దీనితో చిర్రెత్తిపోయిన బాధితురాలు.. తన మొబైల్ ఫోన్ ద్వారా అతని అసభ్య ప్రవర్తనను చిత్రీకరించారు.హసన్కు చేరుకున్న వెంటనే ఆమె ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని కేఎస్ఆర్టీసీ అధికారులకు షేర్ చేశారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే కేఎస్ఆర్టీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. శశిహరిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Content above bottom navigation