బంజారాహిల్స్‌లో టిఫిన్ సెంటర్‌లోకి దూసుకొచ్చిన కారు

ఇటీవ‌ల హైద‌రాబాద్ న‌గ‌రంలో కారు ప్ర‌మాదాలు చాలా ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.. మితిమీరిన వేగంతో కారులు న‌డ‌ప‌డం ఓవ‌ర్ స్పీడ్ ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతోంది.వేగం క‌న్నా ప్రాణం మిన్నా అని చెబుతున్నా స్పీడ్ అనే ధ్రిల్ వారిని కిల్ చేస్తోంది.ఇలా మ‌హా నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి.గ‌త వారం జ‌రిగిన కారు ప్ర‌మాదం మరువక ముందే తాజాగా మరో కారు బీభత్సం జరిగింది. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు ఓ హోటల్ కి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు ప్రమాదం తర్వాత అందులో ఉన్న యువకులు కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. వారంతా మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.కారు అదుపుతప్పి హోటల్ లోకి దూసుకొచ్చినట్టుగా పోలీసుల‌కి ప్ర‌త్య‌క్ష సాక్షులు హోటల్ సిబ్బంది చెప్తున్నారు.

TS10 EP 6331 కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు తెలిసింది. అయితే.. కారులో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో లోపల ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. త్రుటిలోనే ప్రాణ నష్టం తప్పింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ రాయల్ టిఫిన్ సెంటర్‌లో గతంలోనూ ఇదే చోట చాలా ప్రమాదాలే జరిగాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే దారిలో ఇది డేంజర్ స్పాట్‌గా మారింది.రోజూ ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిసున్నా.. తాగి వాహనాలు నడిపే వారిని జైలుకి పంపిస్తున్నా.. ఇంకా మార్పు రావడం లేదు. కొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయటమే కాకుండా.. అమాయకుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఫిబ్రవరి 19న..మియాపూర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రెండు వాహనాలను ఢీకొట్టి హోటల్ లోకి దూసుకెళ్లింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ ఘటనలో హోటల్ లో ఉన్న వ్యక్తి ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. బైక్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని బీహెచ్ఈఎల్ కి చెందిన అఫ్సర్ గా గుర్తించారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ సంతోష్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు.అటు నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర జరిగిన మరో కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అతి వేగంగా వస్తున్న కారు ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారులో ఉన్న యువకులు మద్యం సేవించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇలా వరుసగా జరుగుతున్న కారు బీభత్సాలు.. నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని హడలిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation