Breaking News: ఢిల్లీ ప్రార్థనలపై కేంద్రం కీలక నిర్ణయం… రాష్ట్రాలకు ఆదేశాలు.

ఢిల్లీలో మార్చిలో జరిగిన తబ్లీఘీ జమాత్ సదస్సుల్లో 2001 మంది విదేశాల నుంచి వచ్చిన వారు పాల్గొన్నారని తెలుస్తున్నా… వారిలో ఎంత మంది విదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఎంత మంది ఇండియాలో ఉన్నారన్నది ఇప్పుడు కేంద్ర హోంశాఖ లెక్కలు తెలుసుకుంటోంది. తాజాగా ఈ అంశంపై అన్ని రాష్ట్రాలకు కొత్త ఆదేశాలిచ్చింది. వాటి ప్రకారం… ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు… తమ రాష్ట్రాల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన విదేశీయులు ఎవరైనా ఉంటే గుర్తించాల్సి ఉంటుంది. వాళ్లను తిరిగి తమ దేశాలకు పంపేయాల్సి ఉంటుంది. కాబట్టి… ఈ లిస్ట్ సేకరించమనీ, ఆ వ్యక్తుల్ని గుర్తించమని కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశించింది.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

Ayodhya land dispute: No place for bitterness, fear, negativity in ...

ఢిల్లీ ప్రార్థనల్లో విదేశీయులు పాల్గొనడం వల్లే ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకుతోందనే విషయాన్ని గ్రహించిన కేంద్ర హోంశాఖ… అసలు వారు ఇండియాలో ఉంటే ప్రమాదం అని భావిస్తోంది. అందుకే వాళ్లను వెంటనే తమ తమ దేశాలకు పంపేయాలని రాష్ట్రాల ప్రభుత్వాల్ని కోరుతోంది.కేంద్రం అంచనాల ప్రకారం ఢిల్లీ సదస్సులో పాల్గొన్న విదేశీయుల్లో 824 మంది దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. ఫలితంగా ఇప్పటికే దేశం నలుమూలలా కరోనా వైరస్ పాకేసింది. ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 810 శాతం ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి సంబధించి వస్తున్నవేనని అనధికారికంగా తెలిసింది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

బంగ్లాదేశ్, ఇండొనేసియా, మలేసియా, థాయిలాండ్ నుంచి ఈ సదస్సులో పాల్గొనడానికి 2000 మంది వచ్చారని తెలిసింది. వీళ్ల వల్ల అనూహ్యంగా కరోనా వైరస్ ఇండియాలో పాకిందని అనుకుంటున్న కేంద్ర వర్గాలు… ఇప్పుడు లాక్ డౌన్ అమల్లో ఉన్నా… విదేశాలకు విమాన సర్వీసులు లేకపోయినా… ఇండియాలో ఉన్న ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని మాత్రం పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుందని తెలిసింది.ప్రధానంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎక్కువ మంది ఢిల్లీ సదస్సుకు వెళ్లినట్లు తెలిసింది. వాళ్లలో చాలా మందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తుండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ సదస్సులో పాల్గొన్నే దేశీయుల్ని వెతుకుతున్న రాష్ట్రాల ప్రభుత్వాలు… ఇప్పుడు విదేశీయుల్ని కూడా గుర్తించి, వారి దేశాలకు పంపించేయాల్సి ఉంటుంది.

Content above bottom navigation