గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం… లాక్‌ డౌన్‌ పై కీలక ప్రకటన…

భారత్ ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా భారత్ లాక్ డౌన్ లో ఉండగా, ఇది ఏప్రిల్ 15 వరకు ఉండనుంది. ఇక లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో తెలియక, నగరాలు, పట్టణాల నుంచి భారీగా సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనించిన కేంద్రం లాక్ డౌన్ పై స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నా, రికవరీ కేసులు ఎక్కువగానే ఉంటుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ పై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 15 తర్వాత లాక్‌ డౌన్ పొడిగిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. లాక్‌డౌన్ పొడిగించే ఉద్దేశం లేదనీ, అలాంటి పుకార్లను నమ్మవద్దని తెలిపింది. కేంద్ర ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, టాక్సుల చెల్లింపులు, ఈఎంఐల చెల్లింపుల్ని మూడు నెలలపాటూ వాయిదా వేయడంతో, అప్పటివరకూ లాక్‌ డౌన్ ఉంటుందని చాలా మంది సోషల్ మీడియాలో ఫుల్లుగా ప్రచారం చేస్తుంటే, కేంద్రం దానిపై స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

PM Modi News | Narendra Modi: Childhood tales that foretold the ...

లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు, పేదలు, రోజువారీ కూలి పని చేసుకునేవారు, శ్రామికులు బాగా దెబ్బతిన్నారు. ఇప్పుడు వారికి కనీసం కడుపు నింపుకోవడానికి కూడా చేతిలో డబ్బు లేకుండా పోయింది. మరో రెండు వారాలు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఈ రెండు వారాలూ ఎలా గడపాలో కూడా వాళ్లకు అర్థం కావట్లేదు. ఇలాంటప్పుడు లాక్‌డౌన్ పొడిగిస్తే, కోట్ల మంది కడుపుకొట్టినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందువల్ల కేంద్రం లాక్‌‌ డౌన్ పొడిగించకూడదని నిర్ణయించుకుంది. ఇప్పుడు దేశ ప్రజలు వచ్చే రెండు వారాలే లాక్‌డౌన్ ఉంటుందన్న ఉద్దేశంతో తమ ప్రణాళికలు వేసుకోవడం మేలు. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు కేరళ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా పెరుగుతున్నాయి తప్ప… మిగతా రాష్ట్రాల్లో అంత జోరేమీ లేదు. అందువల్ల అవసరమైతే, కేసులు పెరిగే రాష్ట్రాల్లో మాత్రమే కేంద్రం మున్ముందు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. మిగతా రాష్ట్రాలకు ఏప్రిల్ 15 తర్వాత లాక్‌డౌన్ నుంచి స్వేచ్ఛ లభించనుంది.

సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

అలాగే లాక్ డౌన్ పై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రక్రియను పూర్త స్థాయి లో అమలు చేయాలనీ ఉన్నతాధికారులకు సూచించింది. అన్ని రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులను కూడా మూసి వేసి రహదారులపై ఒక్క వ్యకి కూడా సంచరించకుండా చూడాలని ఆదేశించింది. సరకు రవాణా తప్ప జాతీయ రహదారులు, పట్టణాల్లో మరే ఇతర రవాణా జరగకూడదని ఆదేశాలు జారీ చేసింది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు, విద్యార్థులకు కావలసిన సహాయాన్ని అధికారులు అందించాలన్నారు. అద్దె చెల్లించాలని ఒత్తిడి తెచ్చిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి వెనకాడవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా వలస కూలీలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళ్తన్నారని ఈ వలసలను నివారించి వారికీ కావలసిన వస్తాయి, భోజన ఏర్పాట్లు చేయాలని కేంద్రం పేర్కొంది. మరో వైపు ప్రజలు లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తున్న విషయం పై కూడా కేంద్రం సీరియస్ అయ్యింది. స్వీయ నియంత్రణ పాటించకుండా బయటకు వస్తున్నా వ్యక్తులను కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని ఆదేశించింది. ఈ బాధ్యత పూర్తిగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలదేనని స్పష్టం చేసింది. ప్రజలు లాక్ డౌన్ న్యూబ్ పూర్తి స్థాయిలో అమలుచేయడం లో అధికారులు విఫలమైతే వారిపై చర్యలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ అధికారులు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించింది.

Content above bottom navigation