రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. మోటార్ వెహికిల్ చట్టంలో ఈమేరకు కొన్ని మార్పులు చేసింది. అందులో ద్విచక్రవాహనాలు నడిపే వారికి కొత్త నిబంధనలు విధించింది. నిబంధనల ప్రకారం, బైక్ మీద వెనకాల కూర్చునే వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా కచ్చితంగా బైకులకు హ్యాండ్ హోల్డ్స్ ఉండాలని కేంద్రం సూచించింది.