సినిమా థియేటర్స్ ఓపెనింగ్ పై కేంద్రం కీలక ప్రకటన.

110

కరోనా కారణంగా మూడు నెలలుగా థియేటర్స్ అన్నీ మూసివేయబడ్డాయి. ఎప్పుడు ఓపెన్ చేస్తారనే దానిపై రోజుకో చర్చ జరుగుతూనే ఉంది కానీ ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఇప్పుడు దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్ తర్వాత మాత్రమే పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మాట్లాడుతూ..

జూన్ నెలకు సంబంధించి కొవిడ్-19 కేసుల సంఖ్యను, పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాత్రమే సినిమా హాళ్లను ఎప్పుడు తెరిచేదీ నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.

కొవిడ్-19 పరిణామాల వల్ల చలన చిత్ర రంగం ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తదితర సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రాలు సమర్పించారు. ఈ విషయమై కేంద్ర మంత్రి జావడేకర్ జూన్ 2న ఆయా సంఘాల ప్రతినిధులతో వీడియో సమావేశం ద్వారా చర్చించారు.

Content above bottom navigation