వర్మను కలిశాకా రేణుక చెప్పిన సంచలన విషయాలు.. చెన్నకేశవులు ఎలాంటి వాడో మొత్తం చెప్పేసింది..

రెండు నెలల కింద హైదరాబాద్‌లో జరిగిన అతి నీచమైన ఘటన దిశ రేప్ అండ్ మర్డర్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎపిసోడ్‌లో పది రోజులకే నిందితులను కాల్చి చంపేసారు పోలీసులు. ఇందులో మలుపులు లేవు.. ట్విస్టులు లేవు.. రేప్ చేసిన ఒక్క రోజులోనే నిందుతులను పట్టుకున్నారు ఖాకీలు. ఆ తర్వాత విచారణ పూర్తి చేసి.. సీన్ రీ కన్సస్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయారని కాల్చి పడేసారు. అయితే దిశ ఎపిసోడ్ అయిన దగ్గర్నుంచి కూడా దీనిపై సినిమా ఎవరో ఒకరు తీస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. చివరికి అదిప్పుడు వర్మ చేతుల్లోనే పడింది. కొందరు వద్దని వారిస్తున్నా, ఆర్జీవీ మాత్రం పట్టించుకునేలా కనిపించడం లేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీయడానికి ఫిక్సైపోయాడు. అందుకే దిశ నిందుతుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కలిసాడు వర్మ. ఆమెతో దిశ ఘటనకు ముందు ఏం జరిగింది.. చెన్నకేశవులు ఎలాంటి వాడు.. ఊళ్లో ఎలా ఉండేవాడు ఇలా చాలా విషయాల గురించి ఆరా తీసినట్లు తెలుస్తుంది.

Image result for chennakesavulu wife renuka meets rgv"

ఈ సమయంలో రేణుక చెన్నకేశవులు గురించి కొన్ని విషయాలు చెప్పింది. నా భర్త మంచోడే. కానీ ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడో అర్థం అవ్వడం లేదు. నా భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు అంటే ముందు నేను నమ్మలేదు. కానీ తర్వాత సాక్షాలు చూసి నమ్మాల్సి వచ్చింది. మా ఊరిలో ఎవరిని అడిగినా కూడా మా అయన క్యారెక్టర్ గురించి చెబుతాడు. ఎప్పుడు ఏ ఆడపిల్లను కూడా ఒక్కమాట అనలేదు. అలాంటి నా భర్త ముగ్గురితో కలిసి ఒక అమ్మాయిని చంపాడు అంటే చాలా బాధేసింది. 15 ఏళ్ల వయస్సులో అతనిని ఫస్ట్ టైమ్ చూశా. దాదాపుగా రెండేళ్ల నుంచి అతను నాకు తెలుసు. అలాంటి వాడు ఇలాంటి పని చేశాడు అంటే ఇప్పటికి కూడా నమ్మాలనిపించడం లేదు. ఆ ఘటన జరిగిన రోజు ఎవరితో మాట్లాడకుండా పడుకున్నాడు. అలసిపోయి పడుకున్నాడు అని అనుకున్నాం కానీ ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడని ఊహించలేదు. నా భర్త చేసిన పనికి నేను నా బిడ్డ దిక్కులేని వాళ్ళం అయ్యాం అని రేణుక చెప్పుకుని కన్నీటి పర్యంతం అయ్యింది. ఇలా రేణుక నుంచి పూర్తీ వివరాలను సేకరించాడు వర్మ. ఇవన్నీ తన సినిమాలో పెడతాడేమో మరి..?

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక రేణుకను ఆర్జీవీ ఆర్థికసాయం చేశాడు. బ్లాంక్ చెక్కును ఆమెకు ఇచ్చాడు. ఆమెను కలిసిన తర్వాత వర్మ ట్వీట్ చేశాడు. 16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు.. అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనివ్వనుంది.. దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడంటూ పోస్ట్ చేసాడు వర్మ. ఒక చిన్నారి అయ్యుండి ఆమె మరో చిన్నారికి జన్మనివ్వబోతుందిప్పుడు. వాళ్లిద్దరికీ ఇప్పుడు మంచి భవిష్యత్తు లేదని తెలిపాడు వర్మ. మరోవైపు దిశ సినిమా కోసం దిశ కుటుంబాన్ని కూడా వర్మ కలుస్తాడని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి వర్మ దిశా సినిమాను ఎలా తీస్తాడో.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation