అత్యాచారం జరగకుండా కరోనా వైరస్ కాపాడింది.

6731

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బయపెడుతుంది. ప్రాణాంతక కరోనా వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ దేశంలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండగా.. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా వందల్లో చనిపోయారు. వేల సంఖ్యలో బాధపడుతున్నారు. రోజు రోజుకి కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోండగా.. కేసుల సంఖ్య గణనీయంగా నమోదు అవుతుంది. కరోనా వైరస్తో చైనాలో ఇప్పటివరకు 492మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతుండగా.. ఓ మహిళ మాత్రం కరోనా వైరస్ పేరుతో అత్యాచారం నుంచి బయటపడింది.

Image result for coronavirus

చైనాలోని వూహాన్‌కు 3 గంటల ప్రయాణ దూరంలో జింగ్‌షాన్‌ అనే ప్రాంతంలో ఒంటరిగా ఓ మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆమె ఇంట్లోకి జియావో అనే వ్యక్తి చొరబడి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి అత్యాచారం నుంచి తప్పించుకుంది. అంతేకాదు, రేపిస్ట్‌ను భయంతో వణికించి పరుగులు పెట్టేలా చేసింది. ఆమె తెలివిగా కరోనా వైరస్ పేరును ఉపయోగించి తెలివిగా, అతడి ముఖంపై దగ్గి, తాను వూహాన్‌ నుంచి వచ్చానని, తనకు కరోనా సోకి ఉందని చెప్పింది. అంతే ఆమెపై అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన జియావో అక్కడ నుంచి పారిపోయాడు. అయితే వెళ్లేటప్పుడు ఆమె ఇంట్లోంచి 3080 యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.30 వేలు పట్టుకెళ్లాడు. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా, జియావోను మాత్రం పట్టుకోలేకపోయారు పోలీసులు. అయితే అజ్ఞాతంలో ఉన్న అతను కరోనా నిజంగానే సోకిందేమో అనే భయంలో తన తండ్రితో సహా వచ్చి పోలీసుల వద్ద నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక చైనా దేశంలో ప్రబలిన కరోనా వైరస్ మన దేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ప్రబలిన చైనా దేశంలోని వూహాన్ నగరం నుంచి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు తిరిగి వచ్చిన విద్యార్థుల్లో వ్యాధి లక్షణాలుండటంతో వారిని ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. చైనా దేశం నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానకిి 8, 878 మంది వచ్చారు. వారిని పరీక్షించగా 21 మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని వైద్యుల పరిశీలనలో ఉంచారు. వారిలో 18 మందికి కరోనా వైరస్ నెగిటివ్ అని రిపోర్టు రావడంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో 51 మంది చైనా నుంచి రాగా వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స చేస్తున్నారు. పూణే నగరంలోని జాతీయ వైరాలజీ ఇన్ స్టిట్యూట్‌కు 44 శాంపిల్స్ రాగా దీనిలో 29శాంపిల్స్ నెగిటివ్ అని తేలింది. ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో 8 మంది కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా వారిలో ఐదుగురికి వైరస్ లేదని వెల్లడైంది. కరోనా వైరస్ లక్షణాలున్న ఓ మహిళ, మరో వైద్యవిద్యార్థిని కటక్ వైద్యకళాశాల ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నామని ఒడిశా వైద్యశాఖ డైరెక్టరు డాక్టర్ సీబీకే మహంతి చెప్పారు. కరోనావైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్యఆరోగ్యశాఖ 104 ఆరోగ్య సహాయవాణి కాల్ సెంటరును ఏర్పాటు చేసింది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation