బిగ్ బ్రేకింగ్: క్వరన్ టైన్ కు ముఖ్యమంత్రి

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ఉన్నవారు .. లేనివారు అన్న తేడా లేకుండా కరోనా పంజా విసురుతుంది. తాజాగా ఒక ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని తేలడంతో మొత్తం రాష్ట్రం అంతా షాక్ అయ్యింది. మరో విషయం ఏమిటంటే ..ఆ ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడానికి కొన్ని గంటల ముందు ..సీఎం తో భేటీ కావడంతో ఇప్పుడు అధికారుల్లో టెంక్షన్ మొదలైంది. ఈ ఘటన మంగళవారం గుజరాత్లో చోటు చేసుకుంది.అహ్మదాబాద్ లోని జమాల్ పూర్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా గ్యాసుద్దీన్ శైలేష్ పర్మార్ అనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ రుపానీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ హోంమంత్రి ప్రదీప్ సిన్హా జడేజాలను కలిశారు. అహ్మదాబాద్ లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రూపానీ వీరితో చర్చించారు. ఈ సమావేశం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జరిగింది. రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే ఇమ్రాన్కు కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన అహ్మదాబాద్ లోని ఆస్పత్రిలో చేరారు.  

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద


కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఇమ్రాన్ తన నియోజకవర్గంలో వందల మందిని కలిశారని… ఎంతోమంది అధికారులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇక ఇమ్రాన్తో సీఎం రూపానీ… భేటీలో ఇద్దరూ సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చేశారని తెలిసింది. ఇమ్రాన్… సీఎం రూపానికి దాదాపు 15 నుంచి 20 అడుగుల దూరంలో కూర్చున్నట్లు తెలుస్తుంది. ముందుజాగ్రత్తగా సిఎం విజయ్ రూపానీకి కరోనా పరీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే సీఎం .ఆ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు  సెల్ఫ్ క్వారంటైన్ అయినట్లు తెలుస్తోంది. రూపానీతోపాటూ… ఇమ్రాన్ ఎవరెవర్ని కలిశారో వారంతా క్వారంటైన్ విధించుకున్నట్లు సమాచారం.  అయితే గత రెండు రోజుల నుంచి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని సీఎంతో భేటీకి ఎలా అనుమతించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటివరకు 615 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

Content above bottom navigation