ప్రేమికుల రోజు లవ్ లో ఫెయిల్ అయిన ఒక అమ్మాయి పంపిన లెటర్…చూస్తే కన్నీళ్లొస్తాయి..

185

ఈరోజు ప్రేమికుల రోజు. ప్రేమికులందరికీ ఇదొక పండుగ రోజు. ఈ ఒక్క రోజు కోసం ఎందరో ప్రేమికులు ఎదురుచూస్తారు. ప్రేమించిన వారికి ప్రేమను చెప్పాలని కొందరు, ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్లు తమ ప్రేమ జ్ఞాపకాలను తలుచుకుని సంతోషంగా గడపాలని కొందరు. ఒక్కొక్క ప్రేమ జంట ఒక్కోలా ప్లాన్ చేసుకుంటారు ఈరోజు. అయితే ఈరోజు ప్రేమలో విఫలం అయినా వారికి మాత్రం ఒక నరకంలా ఉంటుంది. ప్రేమించి దూరం అయినా వాళ్లకు వాళ్ళు ప్రేమించిన వారు గుర్తుకువచ్చి అనుక్షణం నరకంలా ఉంటుంది. నేను ప్రేమించిన వ్యక్తి కూడా ఉండి ఉంటే మేము కూడా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని ఆ ప్రేమికుడు, ప్రేమికురాలు తనలో తానూ బాధపడుతూనే ఉంటారు. అలా ప్రేమలో ఫెయిల్ అయినా ఒక యువతీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ను ఆమె మాటల్లోనే ఇప్పుడు విందాం.

Image result for lovers


నా పేరు దీప్తి. నేను ఇంటర్‌ చదివేటప్పుడు మొదటిసారి భార్గవ్‌ ను చూశాను. మెరున్‌ షర్ట్‌, క్రీమ్‌ కలర్‌ ప్యాంట్‌ తో భలే ఉన్నాడు. అలాగే చూస్తూ ఉండిపోయాను. ఐ థింక్‌ అది అట్రాక్షన్‌ అనుకుంటా. వన్‌సైడ్‌ లవ్‌. అతడు నా సూపర్‌ సీనియర్‌. అతనంటే నాకు పిచ్చి. ఎంతంటే నేను మాటల్లో చెప్పలేనంత. అతనికి తెలియకుండా అన్నీ గమనించేదాన్ని. ఆ తర్వాత అతడికి నేను తనను చూస్తున్నానని తెలిసింది. అతను కూడా నన్ను చూసేవాడు, నవ్వేవాడు, నా చుట్టూ తిరిగేవాడు. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా నేను అతడి కోసమే కాలేజ్‌ కు వెళ్లేదాన్ని. అతను ఒక్కరోజు కాలేజ్ కు రాకపోతే నాకు నరకంలా ఉండేది. అతడి డ్రెస్సింగ్‌ స్టైల్‌, హేయిర్‌ స్టైల్‌, లుక్స్‌, నడక, బైక్‌ డ్రైవింగ్‌ ఇవన్నీ నాకు ప్రత్యేకంగా అనిపించేవి. అవే నన్ను అతడి మీద పడి చచ్చేలా చేశాయి. కొద్దిరోజులకే నా ఇంటర్‌ పూర్తయింది. అతని డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ పూర్తయింది. ఆ తర్వాత నాన్న నన్ను డీఈడీ చేయమన్నారు. అందుకే నేను వేరే చోట ఉండి కోచింగ్‌ తీసుకోవటం మొదలుపెట్టాను.

ఈ క్రింది వీడియోని చూడండి

నా ధ్యాస మొత్తం భార్గవ్‌ మీదే ఉండేది. మా నాన్నను ఒప్పించి నేను కూడా అతను ఉన్న కాలేజీలోనే చేరాను. చాలా రోజుల తర్వాత నేను అతడికి కన్పించే సరికి షాక్‌ అయ్యాడు, నన్ను చూసి ముందు నవ్వాడు. మళ్లీ మా ప్రేమ కథ మొదటికి వచ్చింది. తనంటే నాకు పిచ్చి. కానీ ఇంతలోనే దురదృష్టం నన్ను పలకరించింది. మా ఇంట్లో కొన్ని పరిస్థితుల వలన పెళ్లి చెయ్యాలనుకున్నారు. నేను ఇప్పుడే చేసుకొని అని చెప్పినా కూడా ఇంట్లో వినలేదు. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నా అని చెప్పే దైర్యం నాకు లేదు. దాంతో నాకు వేరే వ్యక్తితో పెళ్లైపోయింది. నాకు వేరే వ్యక్తితో పెళ్ళైన కూడా నేను అతడ్ని మర్చిపోలేకపోతున్నా, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా. ఇక్కడ ప్రేమికులందరికి నేను చెప్పే విషయం ఏమిటంటే.. దైర్యం ఉంటేనే ప్రేమించండి. లేకుంటే ప్రేమించకండి. ప్రేమలో ఫెయిల్ అయితే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలీదు. ప్రేమలో ఫెయిల్ అయినా వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రేమించం అని ఇంట్లో దైర్యం ఉంటేనే ప్రేమించండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రేమించిన వాళ్ళను పెళ్లి చేసుకుంటాం అనే దైర్యం ఉంటేనే ప్రేమించండి. ఇదే నేను మీకు ఇస్తున్న సలహా.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation