అమృత‌కి అభిమాని రాసిన లేఖ చ‌దివితే క‌న్నీరే

236

కులాల చిచ్చు ఉన్మాదం ప్ర‌ణ‌య్ ని అత్యంత దారుణంగా చంపేలా చేశాయి.డ‌బ్బు కాదు ముఖ్యం…ఇక్క‌డ కులం కోసం ప్ర‌ణ‌య్ ని చంపేశాడు మారుతీరావు.200 కోట్లఆస్తి ఉంది క‌దా, త‌న‌కు ఏం జ‌ర‌గ‌దు ? నా కూతురు నాద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది మ‌ళ్లీ పెళ్లి చేస్తా ఇది అత‌ని ఆలోచ‌న‌..పోయేది వాడి కొడుకే నా కూతురు నాద‌గ్గ‌ర‌కి వ‌స్తుంది ఇది మారుతీరావు దుర్భుద్ది.
కాని అన్నీ మాడిపోయిన పిందెలా అత‌ని ఆశ‌లు ఆవిరిఅయ్యాయి.మారుతీరావు ఆలోచ‌న‌ల‌కు అమృత బ్రేకులు వేసింది.
ఈ కుల ఉన్మాద ఆలోచ‌నలే ఉన్న‌ తండ్రి ద‌గ్గ‌ర‌కు రాను అని చెప్పింది. త‌ల్లి వ‌స్తే కేసు పెట్టింది తండ్రికి ఉరిశిక్ష ప‌డాలి అని కోరుకుంది.నాకంటే ఏది ఎక్కువ కాదు అనుకున్న తండ్రి నా జీవితాన్ని నాశ‌నం చేశాడు అని క‌న్నీరు పెడుతోంది.
ప్ర‌ణ‌య్ భౌతికంగా లేక‌పోయినా త‌మ గారాల బిడ్డ‌లో ప్ర‌ణ‌య్ ని చూసుకుంటోంది.త‌న‌కు తండ్రి ఆస్తివ‌ద్దు అని కాలితో త‌న్నిన అభిన‌వ యొధురాలు.నిజ‌మే మీడియా ఎంత ప్ర‌శ్నించినా స‌మాజం ఎన్ని నింద‌లు వేస్తున్నా ఆమె చెప్పే స‌మాధానాలు యోధురాలిగానే చూపుతున్నాయి..ఈ స‌మాజం ఆమెని చీద‌రించుకుంది? తండ్రి జైలుకి వెళ్ల‌డానిక కార‌ణం అయిన కూతురు అని ముద్ర‌వేసింది.మారుతీరావు కూతురి కోసం చంపే అంత ప్రేమ పెంచుకున్నాడు… కాని ఆమె ప్రేమ‌ని గెలిపించే అంత మ‌న‌సు లేని క‌సాయి అని నిరూపించింది.

ఈ క్రింది వీడియో చూడండి

1000 మందిని పిలిచి ఆర్బాటంగా ఫంక్ష‌న్ చేస్తే బాగా చేశాడు అంటారు ఈ స‌మాజం, అదే త‌ర్వాత అప్పులు అయి ఆస్తులు అమ్ముకుంటే ఏమీ లేని వీడికి ఖ‌ర్చులు ఎందుకు సోకులు ఎందుకు అంటారు, ఇది స‌మాజం తీరు. పొగిడినా అదే నోరు తిట్టినా అదే నోరు.అలాగే నిర్భ‌య‌కేసులోను స‌మాజం ఆమెపై ఎన్నో విమ‌ర్శ‌లు చేసింది.. సాయంత్రం బాయ్ ఫ్రెండ్ తో సినిమాలు షికార్లా అని పోస్టులు పెట్టారు.టైట్ జీన్స్ టీష‌ర్టుల‌తో అందానికి మెరుగులు దిద్దుకునేందుకు బ్యూటీపార్లర్ కు ఇది వెళ్లాలా, రాత్రి పూట అవ‌స‌ర‌మా అని దిశ‌పై కామెంట్లు చేశారు ఈ స‌మాజం…ఇలా అమ్మాయిల సంఘ‌ట‌న‌లు జ‌రిగితే స‌మాజం వారికి ఇచ్చిన బ‌హుమానాలు ఇవి.ఇలా అమ్మాయిల ఇష్టాల‌కు విలువ‌లు ఇవ్వ‌ని వారు చాలా మంది ఉన్నారు.జీవితాంతం క‌లిసి ఉండాల‌నుకునే వారు వారికి న‌చ్చిన వారిని చేసుకుంటే త‌ప్పేముంది?
వారి ఎంపిక బాగోపోతే జీవితాంతం ప‌డే క‌ష్టాలు వారే క‌దా? వారే న‌వ‌యుగ స‌మాజంలో ఉదాహ‌ర‌ణ‌లుగా మార‌తారు ?

Image result for amrutha


కాని త‌ల్లిదండ్రులు ఇది ప‌ట్టించుకోరు ప్ర‌ణ‌య్ అమృత విష‌యంలో ఇదే జ‌రిగింది.మారుతీరావు కూడా ఇలాగే చేశాడు ఆమె ప్రేమ‌ని ఆలోచించ‌కుండా అల్లుడ్నే చంపేశాడు.నిజంగా వీరంద‌రి కంటే ఆమె యోధురాలు అని చెప్పాలి.ఆమెకి మ‌రో వివాహం చేయాలి అని మారుతీరావు అనుకున్నాడు కాని స‌మాజం కూడా అదే కోరుతోంది.కాని అది కూడా ఆమె జీవితానికి వెలుగులు నింప‌డానికి మాత్ర‌మే.ఎన్నాళ్లు ఈ స‌మాజంలో ఆమె అలా ఒంట‌రిగా ఉంటుంది.ప్ర‌ణ‌య్ గుర్తుల‌తో గ‌డిపేస్తుంది, ఆమెకి మంచి జీవితం ఉంది ఇక ప్ర‌ణ‌య్ ఆలోచ‌న‌ల నుంచి ఆమె బ‌య‌క‌టు వ‌చ్చి మంచి జీవితం అనుభ‌వించాలి.చిన్న‌త‌నంలోనే తన భ‌ర్త‌ని పొగొట్టుకుని ఆమె ఇంకా క్షోభ ప‌డ‌కూడ‌దు.ఆమె మ‌రో వివాహం చేసుకోకూడ‌దు అని కోరుకునే వారు ఈ స‌మాజంలో ఉన్నారు.అది వారి మూర్ఖ‌త్వం, స‌తీస‌హ‌గ‌మ‌నం లాంటి అరాచ‌క విధానాలు కావాలి అని కోరుకునే వారు అనే బిరుదు వారికివ్వాలి.మారుతీరావు చేసిన ప‌నికి ఆమె బ‌లైంది.పాపం ప్ర‌ణ‌య్ కుటుంబం ఒంట‌రి అయింది. ఇలా తండ్రి లేని ఆ చిన్నారి మ‌రింత బాధ‌ప‌డ‌కూడదు. కులాల‌కు మ‌తాల‌కు అతీతంగా మ‌రో వివాహం చేసుకోవాలి అని చాలా మంది కోరుతున్నారు.అంతా అమృత ఆలోచ‌న‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.నేటి స‌మాజంలో ఆమె సాధించాల్సింది చాలా ఉంది.ఇది నా ఆలోచ‌న – మ‌రి మీ ఆలోచ‌న కామెంట్స్ రూపంలో చెప్పండి.ఇది ఆమెకు ఓ అభిమాని రాసిన లేఖ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

తన హోయలతో షేక్ చేస్తున్న శ్రద్ధా కపూర్

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation