అమృతకు ఒక సామాన్యుడు రాసిన లేఖ..

127

అమృత అందరిలా నేను నిన్ను తప్పుగా అనుకున్నాను, కానీ నేడు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను.. నీ వయసు చుస్తే నిండా పాతికేళ్ళు లేవు. జీవితంలో రెండు పెద్ద దెబ్బలు తిన్నావు. ఒకటి…ప్రేమించిన వ్యక్తిని నీ కళ్ళముందే రక్తపు మడుగులో కొట్టుకుంటూ చనిపోయాడు. రెండు…నీ తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నీ భర్తని 21 ఏళ్ళకి పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు నేను కూడా, అందరిలాగే నీకు ఒళ్ళు కొవ్వు పట్టి, లేచిపోయి నీ తండ్రి ఆశలని గౌరవాన్ని వమ్ము చేశావు నీదేమి ప్రేమలే అనుకున్నాను. కానీ రెండేళ్ళు కావస్తున్నా, యవ్వనంలో నువ్వు నీ భర్తని కోల్పోయినా, నేటికి తనతో గడిపిన జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నావ్ చూడు… నీది నిజంగా స్వచ్చమైన ప్రేమే అనిపిస్తుంది.. పోనీ నీ భర్త చనిపోయాక నీ తండ్రి వందలకోట్ల ఆస్తి కోసం తప్పక వస్తావులే.. నీలాంటి వాళ్ళని లోకంలో ఎంతమందిని చూడలేదనుకున్నాను. నా తండ్రి ఆస్తి నా ఎడమకాలు చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకతో సమానంలా నాడు నేడు చెప్పిన తీరు గ్రేట్.

ఈ క్రింది వీడియో చూడండి

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

కానీ రెండేళ్ళు గడుస్తున్నా, నీ భర్త చనిపోయినప్పుడు నీ మాటల్లో ఎంతటి కాన్ఫిడెన్సు కనిపించిందో నేడు నీ తండ్రి చనిపోయినప్పుడు అదే మొండితనం నీలో కనిపించింది. నేను నా తండ్రి మారుతీరావుకి శిక్ష వేయమని అడగలేదు. నా భర్త కులం తక్కువ వాడనే ఒకే ఒక కారణంతో తనని నడిరోడ్డుపై చంపిన ఒక హంతకుడిని చట్టప్రకారం శిక్షించమని అడుగుతున్నానని, చెప్పినమాట ఏదైతే ఉందో అది 70 ఏళ్ళు తమ జీవితాన్ని మొత్తం వడపోసినవాళ్ళు కూడా ఆ మాట అనలేదు.. కానీ నువ్వు అన్నావ్.. నేను నిన్ను యవ్వనంలో ఉన్న మోజులో లేక భర్త పోయిన బాధలో తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నావ్ అని రెండేళ్ళ కిందట నీ మాటలు విని అనుకున్నాను. కానీ నీ జీవితం ఎటు పోతుందో తెలియకున్నా, నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలా మాట్లాడి నీ అత్తగారి కుటుంబానికి అండగా నిలబడ్డావు చూడు అక్కడ నచ్చావు. ఇంత చిన్న వయసుకి నీకు ఇంత పరిణతా ? ఈ కాలం పిల్లల్లో నీలాంటి అమ్మాయిని ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. పాతికేళ్ళు కూడా లేని నీ జీవితంలో ముఖ్యమైన ఇద్దరూ వ్యక్తులు పోయినా, నువ్వింత ధైర్యంతో పట్టుదలతో, న్యాయం కోసం తపిస్తున్న తీరు, దానికోసం నువ్వు నిలబడ్డ విధానం మాత్రం మెచ్చుకోకుండా ఉండలేను.

Image result for amurtha and sravan
కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

అమృత తన భర్త ప్రణయ్, హత్యగావించిన నాటి నుండి నేటివరకు ఎంతోమంది యెదవలు నిన్ను ఎన్ని రకాలుగా తిట్టారో, ఎన్నిమాటలు అన్నారో వాటన్నిటికి సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. మన సమాజంలో ఏదైనా, ఒక తప్పు జరిగితే లేక అన్యాయం జరిగితే ఏకపక్షంగా ఒకవైపే తీర్పులిస్తారు. కానీ ప్రతి నొప్పికి ఎప్పుడూ రెండోకోణం కూడా ఉంటుందని అది కూడా చూసి తీర్పు ఇవ్వాలని మన Facebook and Whatsapp జడ్జిలందరికి మనస్పూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటూ మీలాంటి ఒక యెదవ. ఏది ఏమైనా నీకు దేవుడు మానసిక, శారీరక ధైర్యాన్ని ఇవ్వాలని, నీ జీవితం ఆనందమయం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమృత. వన్స్ అగైన్ హ్యాట్సాఫ్ అమృత..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation