తిరుపతిలో కరోనా కలకలం.. టీడీపీ ఎంపీకి చెందిన ఫ్యాక్టరీ ద్వారా.. డాక్టర్లు ఏం చెప్పారంటే.

243

క‌రోనా వైర‌స్ చైనా నుంచి అన్ని దేశాలు చుట్టేస్తోంది.ఇప్ప‌టికే 45 దేశాల‌కు ఈ వైర‌స్ పాకేసింది.
దీంతో క‌రోనా దెబ్బ‌కు చాలా వ‌ర‌కూ చైనాకు ఎగుమ‌తులు దిగుమ‌తులు ఆగిపోయాయి.వ్యాపార సంబంధాలు దెబ్బ‌తిన్నాయి.అక్క‌డ చైనా దేశానికి బ‌య‌ట దేశం వారు ఎవ‌రూ వెళ్ల‌డం లేదు, ఇటు చైనా నుంచి మ‌రెవ‌రూ రావ‌డం లేదు.విమానాల రాక‌పోక‌లు కూడా జ‌ర‌గ‌డం లేదు.అయితే క‌రోనా ఎఫెక్ట్ మ‌న దేశంలో కూడా క‌నిపించింది.కొత్త వైర‌స్ వ‌చ్చింది అంటే క‌చ్చితంగా కేర‌ళ వ‌ణుకుతుంది ఈసారి కూడా కేర‌ళ‌ని క‌రోనా వైర‌స్ భ‌య‌పెట్టింది.తాజాగా మ‌న ఏపీలో తిరుమ‌ల ఎంతో పుణ్య క్షేత్రం అక్క‌డ కూడా క‌రోనా క‌ల‌క‌లం రేపింది.ప్రపంచ ప్రఖ్యాత ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల-తిరుపతిలో మళ్లీ కొవిడ్ క‌రోనా వైరస్ భయాలు వ్యాపిస్తున్నాయి. తైవాన్ నుంచి తిరుపతికి వచ్చిన ఓ వ్యక్తి.. తీవ్రమైన దగ్గు, జలుబుతో రుయా ఆస్పత్రిలో చేరాడు. 15 రోజులుగా అతనిని ఐసోలేషన్ వార్డులోనే ఉంచి చికిత్స అందిస్తోన్న డాక్టర్లు.. వైరస్ నిర్ధారణ కోసం శాంపిల్స్ ను పుణె ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం నాటికి అతని పరిస్థితి నిలకడగానే ఉందని, పుణె ల్యాబ్ నుంచి టెస్టుల ఫలితాలు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

Image result for corona virus

తైవాన్ కు చెందిన చెంగ్ షీ హసన్.. ఫిబ్రవరి 15న తిరుపతికి వచ్చాడు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీలో ఓ భారీ యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు చెంగ్ షీ ఇక్కడికొచ్చాడు. ఫ్యాక్టరీలో పని జరుగుతుండగానే విపరీతంగా దగ్గు వస్తుండటంతో యాజమాన్యం ఆతణ్ని రుయా ఆస్పత్రికి తరలించింది. అప్పటి నుంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని, అనుమానిత కేసు కానప్పటికీ.. సదరు వ్యక్తి తైవాన్ నుంచి వచ్చిన కారణంగా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆస్పత్రిలోనే ఉంచామని డాక్టర్లు చెప్పారు. చెంగ్ షీ సొంత దేశం తైవాన్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటిదాకా 39మందికి వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు నిర్ధారణ చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తిరుమల-తిరుపతికి వస్తుండటం, కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఏపీ సర్కారు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రుయాతోపాటు రాష్ట్రంలోని ఇతర బోధనాసుపత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా బ్రేక్ అయిన తర్వాత విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారిలో 187 మందికి టెస్టులు చేయగా, 8 మంది అనుమానితులుగా తేలారు. వాళ్ల నమూనాలను పుణె ల్యాబ్ కు తరలించారు. టెస్టుల ఫలితాలు వచ్చిన తర్వాతే తైవాన్ వ్యక్తిని డిశ్చార్జి చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని రుయా డాక్టర్లు తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation