హాస్పిటల్ లో కరోన రోగి టిక్ టాక్ వీడియోలు షాక్ లో డాక్టర్లు

287మనుషుల్లో టిక్‌టాక్‌ పిచ్చి ఓ రేంజ్‌లోకి వెళ్లిపోయిందేమో అనిపిస్తోంది. ఆ పిచ్చి ఏ స్థాయిలో ఉందంటే.. కరోనా వచ్చి బెడ్‌మీదున్న పేషంట్‌ కూడా టిక్‌టాక్‌ వీడియో చేయకుండా ఉండలేని పరిస్థితి. చెన్నైకి ఓ యువతి అలాంటి పనే చేసింది. కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతూ కూడా… ఓ 25 ఐదేళ్ల యువతి టిక్‌టాక్‌ చేసింది. చైనా వల్లే ఇంతటి కష్టం అంటూ ఆస్పత్రి సిబ్బందితో కలిసి ఒక టిక్ టాక్  వీడియో చేసింది.

షాపింగ్‌ మాల్‌ లో పని చేస్తోన్న ఆ యువతికి టిక్‌టాక్‌ ఒక వ్యసనంగా మారింది. ఆ పిచ్చితోనే టిక్ టాక్ చేయకుండా ఉండలేక ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఇది కాస్తా వైరల్‌ కావడంతో.. అధికారులు సీరియస్‌ అయ్యారు. టిక్ టాక్‌కు సహకరించిన ముగ్గురు ఆస్పత్రి సిబ్బందిపై వేటు వేశారు. సిబ్బందిపై వేటువేసినా.. తను మాత్రం టిక్ టాక్ వీడియోలు చేస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తోందా యువతి. 

అర్ధరాత్రి సీఎంకు ఫోన్.. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు 14మంది యువతుల ‘లాక్‌డౌన్’ జర్నీ

యాంకర్ ప్రదీప్ భారీ విరాళం ఎంత ఇచ్చాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు

ఇండియా లో కరోనా అరికట్టడానికి ఈ లేడీ సైంటిస్ట్ చేసిన పని తెలిస్తే సెల్యూట్ చేస్తారుContent above bottom navigation