కేరళలో కరోనా వైరస్.. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు

69

కొవిడ్‌-19 వైరస్‌ కేవలం నెలన్నర వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 69 వేల మందికి సోకింది. అందులో 68500 మంది బాధితులు ఒక్క చైనాలోనే ఉన్నారు. చైనాలో ఇప్పటిదాకా1665 మంది ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మిగిలిన 500 మంది 28 దేశాల్లో కొవిడ్‌-19 బారిన పడ్డారు. ఆ 500 మందిలో 355 మంది జపాన్‌ తీరంలో నిలిచి ఉన్న ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌకలోని వారే. క్వారంటైన్‌గా మార్చిన ఆ నౌకలో తాజాగా మరో ఇద్దరు భారతీయులకు ఆ వైరస్‌ సోకింది. దీంతో 138 మంది భారతీయులున్న ఆ నౌకలో ఇప్పటిదాకా ఐదుగురు ఆ వైరస్‌ బారిన పడినట్టయింది. నౌకలో ఉన్న భారతీయుల్లో.. కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చినవాందరినీ మనదేశానికి చేర్చడానికి అవసరమైన సాయం చేస్తామని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఈ కోవిడ్-19 ఇండియాలోని కేరళ లోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవలే భారత్ తిరిగొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో వారికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో వారిని కేరళలో కాసర్ గోడ్ జిల్లా కన్హంగాడ్‌ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా వార్డులకు తరలించి చికిత్స అందించారు. కేరళ వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన వైద్య నిపుణుల చికిత్స కారణంగా ఆ ముగ్గురు కరోనా బాధితులు పూర్తీగా కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్థారించారు. వైరస్‌ను జయించడంపై… కేరళ ప్రభుత్వ వర్గాలు, విద్యార్థుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కోలుకున్న విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయినా వెంటనే బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే మళ్ళి కరోనా సోకుతుందేమో అని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. అలాగే తినే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే కొందరు వీళ్ళ దగ్గరకు రావడానికి ఇంకా సంకోచిస్తున్నారు. వీళ్లకు పూర్తీగా నయం అయ్యిందని డాక్టర్స్ చెప్పిన కూడా జనాలు వీళ్ళను చూసి ఇంకా భయపడుతున్నారు.

Image result for kerala coronavirus victim

ఇక ఈ ముగ్గురికి కరోనా నెగెటివ్ రావడంతో కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజక్ ట్విటర్ లో స్పందించారు. ‘‘నిపా కేసులో మాదిరిగానే, కరోనా వైరస్‌ పై పోరాటంలో కేరళ విజయం సాధించింది. కరోనా బారిన పడిన ముగ్గురూ పూర్తిగా కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్థారించారు. క్వారంటైన్‌ పరిశీలనలో వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఆరోగ్య శాఖకు అభినందనలు..’’ అని ట్వీట్ చేసారు. వారిలో త్రిశూర్‌కు చెందిన ఓ విద్యార్థిని రక్త నమూనాలను తాజాగా అలెప్పీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పరీక్షించగా.. వైరస్‌ జాడ కనిపించలేదని సీనియర్‌ వైద్యాధికారి ఒకరు తెలిపారు. దీంతో విద్యార్ధిని డిశ్చార్జ్ చేసినట్లు కాసర్ గోడ్ జిల్లా వైద్య అధికారి ఇన్‌ఛార్జ్ డాక్టర్ రామ్‌దాస్ తెలిపారు. 18రోజుల చికిత్స అనంతరం విద్యార్ధిని డిశ్చార్జ్ అయ్యారు. మరో పదిరోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలని, ఎలాంటి మెడిసిన్ అవసరం లేదని రామ్ దాస్ చెప్పారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation