ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా వైరస్ కలవరపెడుతోంది.ఎవరైనా తుమ్మినా దగ్గినా వారికి కరోనా ఉందేమో అనే భయం కలుగుతోంది.ఈ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.మన దేశంలో కూడా 70 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.చైనా నుంచి ఇతర దేశాలకు పాకి ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది..మెడిసన్ లేని వైరస్ వ్యాధిగా దీనిని డబ్లూ హెచ్ వో గుర్తించింది,పలు దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ఇలా ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ తాజాగా లేఖ రాసింది?వైరస్ లేఖ రాయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా?లెట్స్ వాచ్ దిస్ స్టోరీ .
ఈ క్రింది వీడియో చూడండి
కరోనా వైరస్ పుట్టింది మన దేశ గడ్డ కోసం అని చెబుతోంది…
తాను పుట్టిందే మన దేశం కోసమట. పైగా, అది మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకే పుట్టిందట. ఈ లేఖలో దాని బిల్డప్ చూస్తే.. ఓరి దీని యేషాలోఅనకుండా ఉండలేరు. వేలాది మందిని పొట్టన పెట్టుకుంటూ.. ఏదో ఘనకార్యం చేసినట్లుగా ఎకసెక్కాలు చేస్తూ రాసిన ఈ కరోనా లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది ఎవరో రాసిన లేఖ కాని కరోనా రాసిన లేఖగా ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియా అభిమానులు.

మరి దీన్ని ఎవరు రాశారో గానీ.. మన ‘నమస్తే’కు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకే కరోనా పుట్టినట్లు ఇందులో చెబుతున్నారు….కరోనా జర చోడోనా అంటూ రాసిన ఈ లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
కరోనా అను నేను..
కులంతో గానీ, మతంతో గానీ..
చర్మ రంగుతో గానీ, భాషతో గానీ..
మగ కానీ, ఆడ కానీ, తేడా కానీ..
కరోడ్పతినైనా కానీ, కటిక పేదవాడినైనా కానీ..
ఏ భేదాలు లేకుండా,
అంతఃకరణ శుద్ధితో అంటుకుంటానని ప్రమాణం చేస్తున్నా.
ప్రపంచంలో అంతా భారతీయ సాంప్రదాయం (నమస్తే) పాటించేలా చేస్తానని,
ముఖ్యంగా భారతీయులకు, వాళ్ల సాంప్రదాయాల విలువ తెలిసేలా చేస్తానని మాటిస్తున్నా.
థాంకింగ్ యూ ప్రపంచం అని లేఖలో రాసి ఉంది..
ఇట్లు మీ శ్రేయోభిలాషి కాని కరోనా, స్వస్థలం: చైనా అంటూ ఈ లేఖను ముగించారు.
చూశారుగా చైనా లో ఈ వైరస్ వచ్చిన తర్వాత అందరూ షేక్ హ్యాండ్స్ మానేసి చేతితో నమస్తే చెబుతున్నారు, మన సంస్కృతిని పాటిస్తున్నారు, పూర్తి శాఖాహరులుగా మారిపోయారు, అందుకే ఈ లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ క్రింది వీడియో చూడండి