భారత్‌ను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశంలో అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతుండగా.. తెలంగాణలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వీరిలో ఒకరు వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మిగిలిన 58 మందికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు.
తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రెస్మీట్లో తెలిపారు సీఎం కేసీఆర్. క్వారంటైన్ కేంద్రాల్లో 20 వేల మంది ఉన్నారని.. వారికి పరీక్షలు, చికిత్స కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 11000 ఐసోలేషన్ బెడ్స్… 1400 క్రిటికల్ బెడ్స్ రెడీగా ఉన్నాయని.. 60 వేల మంది కరోనా పేషెంట్లు ఉన్నా హాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. లాక్డౌన్ సమయంలో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.