కరోనాతో నర్స్ మృతి ..ఆమె చివరి మాటలు వింటే కన్నీరు పెట్టుకోవాల్సిందే..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బ కు వేల సంఖ్య లో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక లక్షల సంఖ్య లో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. యూరప్‌ లో ప్రధాన దేశమైన బ్రిటన్‌ లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ కరోనా మృతుల 4వేలు దాటిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 41,903కి చేరింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోతే కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా సాధారణ ప్రజలతో పాటు వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. ఈ మద్యమే కరోనా పేషెంట్స్ కు వైద్యం చేస్తున్న కొందరు డాక్టర్స్, నర్స్ లకు కరోనా సోకుతున్న సంగతి తెలిసింధే.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

తాజాగా కరోనా బారిన పడి నస్రీన్ అనే నర్సు(38) చనిపోయింది. చనిపోయే ముందు భర్త ఆమె పక్కనే ఉన్నారు. చివరిగా ఆమె భర్తతో చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌కు చెందిన అరీమా నస్రీన్ వాల్‌సన్ మ్యానర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఆమె ఎప్పటి నుంచో అక్కడే హౌస్‌ కీపర్, హెల్త్ కీపర్‌ గా పనిచేస్తూ తపనతో నర్సింగ్ కోర్సు పూర్తిచేసింది. గతేడాదే నర్సుగా అదే ఆస్పత్రిలో విధుల్లో చేరింది. ఇటీవల బ్రిటన్‌లో విలయ తాండవం చేస్తుండటంతో నస్రీన్ రోగుల సేవలో మునిగిపోయింది. కరోనా పేషెంట్స్ కు సెపరేట్ గా ఉంచే కార్వంటైన్ లో ఆమె వైద్య సేవలు అందిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె కూడా కరోనా బారిన పడింది. దాంతో ఆమె రోగులకు సేవ చేసిన ఆ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. అయితే డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా కూడా ఆమెను కరోనా నుంచి కాపాడలేకపోయారు. ఇటీవల ఆమె పరిస్థితి విషమించడంతో డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్పేశారు.

దీంతో నస్రీన్‌ను చూసేందుకు గురువారం భర్త ఆస్పత్రికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో ఆమె మాట్లాడలేకపోయినా సైగలతో పిల్లలు జాగ్రత్త అంటూ భర్తకు చెప్పింది. దీంతో భర్త ఆమె దగ్గరకు వెళ్లి ‘బెంగ పెట్టుకోకు.. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటా’ అని చెప్పాడు. ఆ తర్వాత డాక్టర్లు వద్దని చెబుతున్నా భార్యను హత్తుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే నస్రీన్ ప్రాణాలు కోల్పోయింది. నస్రీన్‌కు ఆస్పత్రితో సుదీర్ఘ సంబంధం ఉండటంతో అక్కడి సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. నర్సుగా ఆమెకు 16ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమెకు భర్త, 8.. 10.. 17 ఏళ్ల వయస్సున ముగ్గురు పిల్లలున్నారు. ఆమె మృతితో అంతా శూన్యంగా అనిపిస్తోందని సోదరి ఆశా కన్నీటిపర్యంతమైంది. ఈ పరిస్థితి ఎవ్వరికీ రావొద్దని.. కరోనా వైరస్‌ లాక్‌ డౌన్‌ ను కచ్చితంగా పాటించాలని, మా సోదరి లాగా ఇంకెవరూ చనిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లాక్ డౌన్ ను పాటించి, ఇతరులకు దూరంగా ఉండి, కరోనా అంతమయ్యేలా ప్రయత్నించాలని ప్రజలను మృతురాలి కుటుంబసభ్యులు వేడుకున్నారు.

Content above bottom navigation