చైనాలో డ్యాన్సులు చేస్తున్న కరోనా వైరస్ రోగులు.. కారణం ఇదేనట

66

కరోనా వైరస్ ర‌క్క‌సిలా అమాయ‌కుల ప్రాణాల‌ని హ‌రిస్తోంది.దాదాపు 1200 మంది చైనాలో ప్రాణాలు కోల్పోయారు.రోజుకి వంద మందికి పైగా ఈ రక్క‌సి వేద‌న‌తో ప్రాణాలు కోల్పోతున్నారు.దాదాపు ల‌క్షా 10 వేల మందికీ ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు గుర్తించారు.సుమారు 60 వేల మందికి ప్ర‌త్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
వేరే దేశాల‌కు సంబంధించి వాహ‌నాలు చైనాలో ల్యాండ్ అయి 15 రోజులు అవుతోంది.అంత దారుణ‌మైన ప‌రిస్దితిని చైనా ఎదుర్కొంటోంది.

Image result for coronavirus

క‌రోనా వైరస్ చైనాతో చెలగాటం ఆడుతోంద‌నే చెప్పాలి.. ఈ వ్యాధి కేవలం ఆ దేశానికే పరిమితం కాకుండా ప్రపంచమంతా పాకింది. దీంతో ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే, ఈ వ్యాధి పుట్టిన ఉహాన్‌లో ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆ నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. జనాలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎవరైనా దగ్గినా, తుమ్మినా.. అధికారులు వాళ్లను బంధించి మరీ హాస్పిటళ్లకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో.. ఉహాన్ హాస్పిటళ్లు వేలాది మంది రోగులు, అనుమానితులతో కిటకిటలాడుతోంది.

Image result for coronavirus

ఇటీవల యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో కరోనా వైరస్ సోకిన రోగులు డ్యాన్సులు చేస్తూ కనిపించారు. ఉహాన్‌లో చికిత్స పొందుతున్న రోగులందరినీ ఒక చోటుకు చేర్చి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. కరోన రోగుల్లో మానసిక ఆందోళన బాగా పెరిగిందని, తీవ్రంగా కుంగిపోతున్నారని వైద్యులు తెలుపుతున్నారు. వారిలో ఆ ఆలోచన దూరం చేసి, ధైర్యాన్ని నింపేందుకు వైద్యులు మంచి సంగీతానికి డ్యాన్స్ చేయించడం ఒక్కటే మార్గమని భావించారు. ఒత్తిడి దూరమైతే రోగి కోలుకోవడం సులభం అవుతుందని అంటున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ సందర్భంగా ఓ వైద్యుడు మాట్లాడుతూ.. ‘‘రోగులు తమ కుటుంబికులకు దూరంగా ఒంటరిగా హాస్పిటళ్లలో గడుపుతున్నారు. ఏ క్షణంలో చనిపోతామో అని భయపడుతున్నారు. రోజంతా బెడ్‌ మీదే గడపడం వల్ల ఇబ్బందికరంగా ఫీలవుతున్నారు. అందుకే, వారితో ఇలా డ్యాన్స్ చేయించడం ద్వారా ఒత్తిడిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని తెలిపారు. ప్రస్తుతం చైనాలో కరోనా వ్యాధితో బాధ‌ప‌డేవారు టెస్ట్ చేయించుకుని ఇత‌రుల‌కి రాకూడ‌దు అని ప్ర‌త్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ వారిని అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచుతున్నారు.. సాయంత్రం పూట వినోదం క‌లిగించే ప‌నులు చేయిస్తున్నార‌ట‌. ఇక్క‌డ వీరికి చికిత్స అందిస్తున్న 10 మంది డాక్ట‌ర్ల‌కు కూడా క‌రోనా సోకింది అని తెలుస్తోంది, వారు కూడా చికిత్స తీసుకుంటున్నార‌ట‌.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation