కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో..

91

కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో.కరోనా వైరస్ దెబ్బకు చైనా విలవిలలాడుతోంది. ఈ మహమ్మారి కారణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో చైనాపై అన్నివైపుల నుంచి ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ దేశాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. చైనా నుంచి వస్తున్న వారిపై ఆంక్షలు విధిస్తున్నాయి. అలాగే ఆయా దేశాలకు చైనా డైరెక్ట్ ఫ్లైట్స్‌ను కూడా రద్దు చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మూతపడుతున్నాయి. మార్కెట్ పూర్తీగా నష్టపోతుంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు అక్కడ 425 మంది మృతి చెందారు. మంగళవారం ఉదయం వరకు ఆ దేశంలో 20,438 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు చైనాలో కొత్త సంవత్సరం వేడుకల సమయం. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నో కార్యక్రమాలను రద్దు చేశారు. అయితే ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుంది, కరోనా సోకకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి. ఒకవేళ కరోనా వస్తే ఏం చెయ్యాలి. ఇలాంటి అంశాలన్నిటినీ 6 మ్యాప్ ద్వారా తెలపడం జరిగింది. ఆ ఆరు మ్యాపులను ఒక్కసారి పరిశీలిద్దాం.

Image result for కరోనా వైరస్
 1. మొదటి మ్యాప్…ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం గురించి…
  చైనాకు దాదాపు మధ్యలో ఉండే హుబే ప్రాంతంలో కరోనా వైరస్‌కు ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో, చైనా అధికారులు మిగతా నగరాల నుంచి హుబే ప్రాంతానికి రాకపోకలు నిషేధించారు. ముందు ముందు కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్ కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం చైనాలో ఆంక్షల జాబితా పెరుగుతూ పోతోంది. ఎక్కువ దేశాల్లో కరోనా వైరస్ కేసులు వెలుగు చూడకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను ఇంకా ‘అంతర్జాతీయ అత్యవసరస్థితి’ గా ప్రకటించలేదు.
 2. రెండవ మ్యాప్.. చైనా లోపల నమోదైన కరోనా కేసుల గురించి…
  హుబేలో ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 1,400కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలోని 10 నగరాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించడంతో కనీసం రెండు కోట్ల మంది ప్రభావితం అయ్యారు. వాటిలో మొట్టమొదట కరోనావైరస్‌ను గుర్తించిన వుహాన్ నగరం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది.
 3. మూడవ మ్యాప్.. చైనా బయట నమోదైన కరోనా వైరస్ కేసుల గురించి…
Image result for కరోనా వైరస్

 1. చైనా బయట ఇప్పటివరకూ థాయ్‌లాండ్, వియత్నాం, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్, నేపాల్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసులను ధ్రువీకరించారు. మిగతా దేశాలు అనుమానిత కేసులను పరీక్షిస్తున్నాయి. వీటిలో భారత్, బ్రిటన్, కెనడా లాంటి దేశాలు ఉన్నాయి.
 2. నాల్గవ మ్యాప్.. కరోనా వైరస్ లక్షణాల గురించి…
  కరోనా వైరస్ సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది. కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది. కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు. ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే… వెంటనే డాక్టర్‌ను కలవాలి.

ఈ క్రింది వీడియోని చూడండి

 1. ఐదవ మ్యాప్.. కరోనా రాకుండా ఏం చెయ్యాలి…
  కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస ఇబ్బందులు ఎదుర్కుంటున్న రోగులకు దగ్గరగా ఉండకూడదు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.
 2. ఆరవ మ్యాప్ .. ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే ఏం చెయ్యాలి..
  చైనా ప్రభుత్వం గతంలో సార్స్ వ్యాపించినపుడు తీసుకున్న చర్యలనే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ కు కూడా పాటిస్తోంది. ఆ దేశంలో ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్టు ధ్రువీకరిస్తే, వారిని మిగతా అందరికీ దూరంగా ఉంచుతారు. కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులను ‘లైట్, మీడియం, సీరియస్ అనే మూడు కేటగిరీలుగా విభజించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డాక్టర్స్ కు సూచించింది. రోగులకు చికిత్స అందించే ఆరోగ్య సిబ్బంది ఈ వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

ఇలా 6 మ్యాపుల ద్వారా కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. కరోనా వైరస్ మన హైదరాబాద్ కు కూడా పాకింది అని వార్తలు వస్తున్నాయి కాబట్టి అందరు తగు జాగ్రత్తలు తీసుకోండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation