కరోనా కట్టడికి విరాట్ అనుష్క విరాళం ఎంత ఇచ్చారంటే

287

ప్రభుత్వాలకు ప్రముఖుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు అతడి భార్య అనుష్క శర్మ కూడా తమవంతు విరాళాన్ని ప్రకటించారు. అయితే బహిరంగంగా ఈ మొత్తాన్ని వెల్లడించకపోయినా ఇద్దరూ కలిసి ప్రధాని అత్యవసర నిధి, మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.3 కోట్లను అందించినట్టు సమాచారం. ‘పీఎం కేర్స్‌ ఫండ్‌ అలాగే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (మహారాష్ట్ర)కు నేను, అనుష్క మద్దతు ఇస్తున్నాం. బాధితులను చూసి మా హృదయాలు బద్దలవుతున్నాయి. మా వితరణ తోటి ప్రజానీకానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు.

Virat Kohli and Anushka Sharma get cute and cuddly while out on a ...
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ పాయల్ ఘోష్

దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించింది. ఇందులో రూ. 5 లక్షలు పీఎం-కేర్స్ ఫండ్‌కి ఇవ్వనున్నట్లు ప్రకటించిన మిథాలీ.. మిగిలిన రూ. 5 లక్షలు తెలంగాణ సీఎం రిలీఫ్ పండ్‌కి కేటాయించింది. భారత్‌లో మంగళవారం ఉదయానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,347కి చేరింది.భారత క్రికెటర్లు గత మూడు రోజుల నుంచి కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వరుసగా విరాళాలు అందిస్తున్నారు. సురేశ్ రైనా అత్యధికంగా రూ. 52 లక్షలు ప్రకటించగా.. సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, అజింక్య రహానె రూ. 10 లక్షలు అధికారికంగా ప్రకటించారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకి పంచి ఇస్తున్నాడు.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మతో కలిసి సోమవారం విరాళం ప్రకటించాడు. కానీ.. ధోనీ రూ. 1 లక్ష విరాళంపై పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో.. కోహ్లీ దంపతులు తాము ఇచ్చిన విరాళం అమౌంట్‌ని రహస్యంగా ఉంచారు. అయితే.. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం విరుష్క జోడి రూ. 3 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. భారత మహిళా క్రికెటర్లలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు విరాళం ఇవ్వగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రూ. 1.5 లక్షలు ఇచ్చింది.

Content above bottom navigation