మూసి ఉన్న ఈ తలుపు వెనుక లెక్కలేనంత ఖజానా…

100

మనల్ని పూర్వం రాజులు పాలించేవారు అని మనకు తెలుసు. అప్పట్లో రాజ్యాలు ఉండేవి, ఆ రాజ్యాలను రాజులు పాలించేవారు. వీళ్ళ చరిత్ర గురించి ఇప్పటికి కూడా మనం చదువుకుంటున్నాం. అయితే అప్పట్లో ఒక రాజ్యానికి మరొక రాజ్యానికి యుద్దాలు జరిగేవి .ఏదైనా రాజ్యం వాళ్ళు మరొక రాజ్యం మీద దాడి చెయ్యడానికి వస్తే, రాజ్యంలో ఉన్న విలువైన సంపదను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచిపెట్టేవారు. అలా దాచిపెట్టిన వాటిలో చాలావరకు బయటపడ్డ ఇంకా బయటపడని సంపద ఇంకా ఎంతో ఉంది. అలంటి ఒక సంపద గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.

ఈ క్రింది వీడియోని చూడండి

ఉత్తరప్రదేశ్‌ లోని రామ్‌పూర్‌ కు చెందిన చివరి నవాబు రాజా అలీఖాన్ కన్నుమూసిన ఐదు దశాబ్దాలు గడచిన తరువాత కూడా అతని ఆస్తిపాస్తుల పంపకాలు ఇంకా జరుగనే లేదు. నవాబు రాజాకు చెందిన ఆస్తులను 16 మంది వారసులకు పంచాల్సి వుంది. ఈ నేపధ్యంలోనే పలు కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. అలాగే ఒక ధనాగారంలోని ఖజానా ఏమేరకు ఉందనేని చూడాల్సి వుంది. ఈ నవాబు కోటలో ఒక స్ట్రాంగ్ రూమ్ ఉంది. దీనిని తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్ట్రాంగ్ రూమ్‌ లో భారీగా నిధులు ఉండే అవకాశముందని భావిస్తున్నారు. నవాబు రాజు అలీఖాన్ 1966 లో కన్నుమూశారు. అనంతరం గద్దెనెక్కిన అతని పెద్ద కుమారుడు తండ్రి ఆస్తిపాస్తులను దక్కించుకున్నాడు. దీంతో రెండవ కుమారునికి ఎటువంటి సంపద దక్కలేదు. దీంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఈ ఉదంతంపై అడ్వకేట్ కమిషనర్ అరుణ్ ప్రకాష్ సక్సేనా మీడియాతో మాట్లాడుతూ… రామ్‌పూర్ చివరి నవాబు రాజా అలీ ఖాన్‌ కు చెందిన ఆస్తుల పంపకం విషయమై అతని కుమారుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే 1972లో రామ్‌పూర్ జిల్లా కోర్టులో కేసు నమోదయ్యింది. తరువాత కేసు హైకోర్టుకు చేరుకుంది. హైకోర్టు ఈ సూట్‌ను డిస్మిస్ చేసింది. దీంతో నవాబ్ అలీ ఆస్తంతా అతని పెద్ద కుమారుడు ముర్త్‌జా అలీకి చెందినట్లయ్యింది.

Image result for ఈ తలుపు వెనుక లెక్కలేనంత ఖజానా…

ఈ నేపధ్యంలో న్యాయం కోసం నవాబ్ అలీ సోదరుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో 2019 జూలై 31న సుప్రీం కోర్టు తన తీర్పు వెలువరించింది. దీని ప్రకారం 1950 తరువాత నవాబులు ఎవరూ లేరని, చివరి నవాబు, దివంగత అలీఖాన్ అవుతారని పేర్కొంది. ఫలితంగా ముస్లిం పర్సనల్ లా, షియా పర్సనల్ లా ప్రకారం ఈ ఆస్తిపాస్తులు వారసులందరికీ చెందాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇది నవాబ్ అలీ పెద్ద కుమారునికి ఎదుదెబ్బలా మారింది. అలాగే ఈ ఆస్తిపాస్తులను నవాబు అలీ వారసులైన 16 మందికి వాటాలు వేయాల్సి వుంది. ఇదిలా ఉండగా బంగళాలో ఒక స్ట్రాంగ్‌ రూమ్ ఉంది. దీనిలో పెద్ద ఎత్తున నిధులు, అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్‌ కు చెందిన తాళం ఎవరి దగ్గర లేదు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ స్ట్రాంగ్ రూమ్‌ ను తెరవాల్సి వుంది. ఈ స్ట్రాంగ్ రూమ్‌ లాకర్‌ ను లండన్‌ కు చెందిన ఒక కంపెనీ రూపొందించింది. ఆ కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ లాకర్‌ ను బాంబులతో పేల్చినా అది తెరుచుకోదు. అయినప్పటికీ దానిని తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈ లాకర్‌ కు నలువైపులా లోహపు తలుపులు ఉన్నాయి. ఈ తలుపులు తెరుచుకుంటే అమూల్యమైన సంపద బయటపడుతుందని చెబుతున్నారు. చూడాలి మరి ఈ తలుపులు ఎప్పుడు తెరుస్తారో, అందులో ఎలాంటి నిధులు బయటపడతాయో…

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation