కోస్తాకు తుఫాన్‌ గండం.. సీమకు భారీ వర్ష సూచన

482

ఓవైపు తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ సమయంలో.. కోస్తా జిల్లాలకు తుఫాను గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిందని.

మరోవైపు రాయలసీమను ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర ఆవర్తనం కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో ఉత్తర అండమాన్ సముంద్రం, దాని పరిసరాల్లో అల్ప పీడనం ఏర్పడుతుందని.. ఇక, ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నట్టు చెబుతున్నారు.

ఈ నెల 12న ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం ఉందని.. ఆ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రతికూల వాతావరణం నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. ఇక, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.. ఇదే సమయంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation