20 ఏళ్ల అమ్మాయితో లేచిపోయిన దొంగ బాబా..ముచ్చటగా మూడో పెళ్లి

115

అతనొక స్వామిజీ.. అతని వద్దకు వచ్చే భక్తులకు వరాల మీద వరాలు కురిపించి బాగానే ఫెమస్ అయ్యాడు. కానీ అతనిలో ఉన్న మరొక కోణం ఇన్ని రోజులకు భక్తులకు తెలియలేదు. కానీ ఇప్పుడు అతను చేసిన పనికి అందరు అవాక్కవుతున్నారు. నిత్యానంద స్వామి, డేరాబాబా, ఓమజాయా బాబా.. ఇలా ఒక్కొక్క బాబాల గుత్తులు రాట్టవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలోకి మరొక స్వామి చేరిపోయాడు. అసలు ఎవరు ఈ స్వామీజీ.. ఏం చేశాడు.. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింది వీడియో చూడండి

కర్ణాటక సరిహద్దులోని కోలారు సమీపంలోని హోళలి భీమలింగేశ్వర సేవాశ్రయం పీఠాధిపతి దత్తాత్రేయ అవధూత స్వామి అలియాస్‌ రాఘవేంద్ర. తాను దేవుడి స్వరూపమని చెప్పి గ్రామస్తులకు దగ్గరై చివరకు ఓ 20 ఏళ్ల అమ్మాయిని లేవదీసుకుపోయాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. తాను తిరుమలలో పెళ్లి చేసుకున్నామని త్వరలో తిరిగి మఠానికి వస్తామని సమాచారం ఇచ్చాడు. బాబా పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న మఠం భక్తులు స్థానికులు షాక్ కు గురైనారు. దీనితో దొంగబాబా ఆచూకీ. మాయం అయిన అమ్మాయి ఆచూకి తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరికోసం పలు బృందాలుగా విడిపోయి తీవ్రంగా గాలించారు. మొదట తిరుపతిలో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేలోపే అక్కడి నుండి మాయమైపోయాడు. తరువాత విజయపురలో స్వామిజీ యువతి ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేముందే మళ్లీ కనిపించకుండా ఇద్దరు మాయమైపోయారు. అలా పోలీసుల కళ్లు కప్పి కొన్ని రోజులు ఆ ఊరు ఈ ఊరు అంటూ తిరుగుతున్నాడు. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న దత్తాత్రేయ అవధూత స్వామీజీ తన గెటప్ పూర్తిగా మార్చేశారు. నీట్ గా గడ్డం వెంట్రుకలు కట్ చేసిన స్వామీజీ బాలీవుడ్ హీరోలాగా కొత్త గెటప్ లో దర్శనం ఇవ్వడంతో పోలీసులతో పాటు మఠం భక్తులు కూడా షాక్ అయ్యారు. పెళ్లి తర్వాత నీట్ గా గడ్డం, వెంట్రుకలు కట్ చేసిన స్వామీజీ బాలీవుడ్ హీరోలాగా కొత్త‌ లుక్‌లోకి మారి.. తన భార్యతో తీసుకున్న ఫోటోలను ఆమె కుటుంబసభ్యులకు పంపించాడు.

Image result for దత్తాత్రేయ అవధూత స్వామి

స్వామీజీ చేసిన పనికి అవాక్కయిన యువతి కుటుంబసభ్యులు, గ్రామస్థులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆయన తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా దత్తాత్రేయ అవధూత స్వామి అలియాస్‌ రాఘవేంద్ర బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా పెళ్లాం, నా జోలికి వస్తే సుపారి కిల్లర్ల చేత చంపేయిస్తానని యువతి బంధువుల‌ను బెదిరిస్తున్నాడు. నేనిప్పుడు స్వామీజీ కాదని, పెళ్లి చేసుకున్నానని మా ఇద్దరి జోలికి వస్తే ఊరుకునేది లేదని 50 లక్షలు అయినా , కోటి రూపాయలు అయినా బెంగుళూరులో ఉన్న మా కుర్రాళ్లకు చెప్పి హత్య చేయిస్తానని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. అయితే కపట స్వామిజి బెదిరింపులను అరుణ్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగ స్వామి కోసం గాలిస్తున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి ఇక్కడా అక్కడా తప్పించుకుని తిరుగుతున్న దత్తాత్రయే అవధూత స్వామీజీ, యువతి చివరికి మంగళూరు సమీపంలోని మరడేశ్వరలోని గెస్ట్ హౌస్ లో పోలీసులు చిక్కిపోయారు. మరడేశ్వరలోని గెస్ట్ హౌస్ లో పోలీసులను చూసిన వెంటనే స్వామీజీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో పోలీసులు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈయనకి ఇది వరకే ఇద్దరితో పెళ్లి అయ్యింది అని ఇది ముచ్చటగా మూడో పెళ్లి అని రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని మోసం చేశారని ఆయన మీద అనేక చీటింగ్ కేసులు నమోదు అయ్యాయని అన్ని కేసులు విచారణలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దొంగబాబా పెళ్లికూతురు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation