నిర్భయ దోషులకు ఉరి.. స్పందించిన దిశ తండ్రి..

129

ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. అభం శుభం తెలియని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గులకు శిక్ష పడింది. ఏడేళ్ల క్రితం నిర్భయకు నరకం చూపించి చంపినా నలుగురు దోషులైన అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌ సింగ్‌లు శుక్రవారం తెల్లవారు జామున ఉరి కొయ్యకు వేలాడిన సంగతి తెలిసిందే. మీరఠ్ నుంచి వచ్చిన తలారీ పవన్‌ జలాద్‌ అనే వ్యక్తి తీహాడ్ జైలులో వారిని ఉరి తీశారు. నేరం జరిగిన ఏడు సంవత్సరాల 3 నెలల 4 రోజుల తర్వాత నిందితులు అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌ సింగ్‌‌కు ఉరి శిక్ష అమలైంది. జైలు నెంబర్‌ 3లో అధికారుల సమక్షంలో ఉరిని అమలు చేశారు. ఉరి ప్రక్రియ పూర్తయ్యాక, దోషుల మృతదేహాలను పరీక్షించిన వైద్యులు ఆ నలుగురు చనిపోయినట్లుగా ధ్రువీకరించారు. తర్వాత పోస్టుమార్టం చేసేందుకు వాటిని డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేస్తారు.

Image result for disha father

ఇక నిర్భయ నిందితుల ఉరిపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులకు ఉరి వేయడంపై దిశ తండ్రి స్పందించారు. నిర్బయ కేసు దోషులకు ఉరిశిక్షను విధించినందుకు సంతోషమని ఆయన అన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని.. దిశ కేసులో చాలా త్వరగా న్యాయం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఆడపిల్లపై అఘాయిత్యాలకు పాల్పడితే వెంటనే చంపేయాలని ఆయన సూచించారు. ఈ కేసులో నిర్భయ తల్లి సుదీర్ఘంగా పోరాడారని ఆయన కితాబిచ్చారు.

హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ నందిని రాయ్

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ఉరి తీయడానికి ముందు నలుగురు దోషులు స్నానం చేశాక వారికి ఇష్టమైన దేవుడ్ని కూడా తలచుకోలేదు.. చివరిసారిగా మతపరమైన పూజలు చేసేందుకు జైలు అధికారులు సమయం ఇచ్చారు. కానీ నలుగురు దోషులు పూజలు చేసుకోవడానికి నిరాకరించారు. తర్వాత టిఫిన్ అందించారు వైద్యులు పరీక్షలు చేశారు. నలుగురు దోషులకు జిల్లా మెజిస్ట్రేట్, జైలు సమక్షంలో మొహాలకు నల్లటి వస్త్రాలను కప్పి ఉరి తీశారు. ఆ సమయంలో 48మందితో భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఉరికి ముందు నలుగుర్ని చివరి కోరిక ఏంటని అడిగారు.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాత్రంతా ఈ నలుగురు దోషులను ప్రత్యేకంగా వేర్వేరు గదుల్లో ఉంచారు. 15మంది జైలు సిబ్బంది వీరిపై నిఘా పెట్టారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ పాయల్ ఘోష్

Image result for నిర్భయ దోషులకు ఉరి.. స్పందించిన దిశ తండ్రి..

ఉరికి ముందు నలుగురు భయంతో మొహాల్లో తెలియని ఆందోళన కనిపించారు. ఉరి తీసే ముందు నిర్భయ దోషులు రాత్రంతా రోదించారని, నిద్ర పోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఉరి నేపథ్యంలో అన్ని బ్యారక్ లను మూసివేసినట్లు జైలు అధికారులు తెలిపారు. ఉరిశిక్ష విధించిన సందర్భంగా తిహార్ జైలులో ఉన్న తోటి ఖైదీలందరినీ లాకప్ గదుల్లో మూసి ఉంచారు. తిహార్ జైలులో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు నిర్భయ దోషులను ఉరి తీసే గంట ముందు లాకప్ గదులన్నింటినీ మూసివేశారు. నలుగురికి ఉరి తీశాక తిహార్ జైలు లాకప్ గదులను తెరిచారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation