ఆ కారణంతోనే చంపేసాడు ఇద్దరకి ముందే పెళ్ళి..!

63

గజ్వేల్‌లో దారుణ హత్యకు గురైన యువతి దివ్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేష్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించక లేదు.దాంతో వారిద్దరూ వేరైపోయారు. పెళ్లి సమయంలో దివ్య మేజర్‌ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు హాస్టల్‌లో ఉంచి చదించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు దివ్యను వెంకటేష్‌ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని తెలిసింది.పంచాయితీలో మందలించడంతో…తాను దివ్య జోలికి రానంటూ వెంకటేష్‌ హామీ పత్రం రాసిచ్చినట్లు స్థానికులు తెలిపారు.

killing love

ఆ తర్వాత దివ్యకు గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌ అనే యువకుడితో వివాహం కుదిర్చారు. ఈనెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది.ఈ నేపథ్యంలో దివ్యకు బ్యాంక్‌ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేష్ దారుణంగా ఆమెని చంపేశాడు. ఆ అమ్మాయి మాత్రం రక్తం ముద్దగా మారింది. బ్యాంకులో విధులు ముగించుకొని రూమ్ కు చేరుకున్న దివ్యను మెడ కోసి హత్య చేశాడు. ముందు నుంచి ఈ ఘోరానికి వెంకటేష్ పాల్పడి వుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అలా పోలీసులు విచార‌ణ చేశారు, మరోవైపు వేములవాడలోని ఇంటికి తాళం వేసి వెంకటేష్‌తోపాటు అతని కుటుంబం ఎక్కడికో వెళ్లిపోయారు.

ఈ క్రింది వీడియో చుడండి

ఈ స‌మ‌యంలో దివ్య కేసులో నిందితుడు వెంకటేష్ పోలీసుల‌కి లొంగిపోయాడు. నేనే హత్య చేశా. చంపేశా అంటూ ఎంతో ఉత్సాహంగా వెంకటేష్ కొద్ది పేపటి కిందట వేములవాడ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఈ హత్యకు పాల్పడినట్లు వేములవాడకు చెందిన వెంకటేష్‌ తనంత తానే అంగీకరించాడు . అంతే కాకుండా దివ్యను చంపిన కత్తిని కూడా తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. దివ్యతో వెంకటేశ్ కు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించక లేదు. అయితే ఆమెకి వేరే వివాహం చేయాల‌ని అనుకోవ‌డం కూడా అత‌ను జీర్ణించుకోలేక‌పోయాను అని తెలిపాడ‌ట‌.వేములవాడ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది అంతా శివరాత్రి బందోబస్తు డ్యూటీలో ఊపిరి సలపని పని లో ఉండగా వెంకటేష్ వచ్చి నేనే చంపా అంటూ కేకలు వేయడంతో పోలీసులే నిర్ఘాంత పోయారు. వెంకటేష్ ను తక్షణమే సిరిసిల్ల ఎస్ పి కార్యాలయానికి పంపించారు. అక్కడ వారు అన్ని లాంఛనాలను పూర్తి చేసి గజ్వేల్ పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation