శివరాత్రి రోజు ఉపావాసం చేయలేని వారు ఈ చిన్న పని చేస్తే ఉపావాసం చేసిన దానితో సమానం

118

హిందూ ధర్మం ప్రకారం ఎంతో మంది దేవుళ్లు దేవతలు ఉన్నా కేవలం వారి రూపాలు మాత్రమే కొలుస్తారు. కానీ ఒక్క శివుడిని మాత్రం లింగంగా పూజించడం విశిష్టత. క్షీరసాగర మధనం జరిగినప్పుడు ముందు హాలాహలం పుట్టింది. అయితే సృష్టిని రక్షించడానికి ఆ ధారాలను తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు శివుడు. అందుకే శివుని గరళకంఠుడు గా అని కూడా భక్తులు పిలుస్తారు. ఇంకా శివుడు అనేక విశిష్టతలు మరియు రూపాలు కలిగి ఉన్నవాడు. అంతటి విశిష్టత కలిగి ఉన్న శివుడికి శివరాత్రి రోజు పూజ చేస్తే ఎంతో ఉత్తమమని పుణ్యమని అంటుంటారు హిందూ భక్తులు. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 21 వ తేదీన వచ్చింది.

ఈ క్రింది వీడియోని చూడండి

శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయం ముందుగానే లేవాలి. అలాగే సూర్యోదయం తరువాత లేస్తే అది మహా పాపం. శివరాత్రి రోజున దేవాలయ దర్శనం చాలా మంచిది ఎందుకంటే గుడిలో లింగాదర్శనం ఎంతో పుణ్యం, మోక్షదయాకం. శివరాత్రి రోజు శివుడికి ఖచ్చితంగా సమర్పించాల్సినవి ఏమిటంటే.. పండ్ల విషయంలో జామకాయ, పువ్వుల విషయంలో జిల్లేడు పువ్వులు, మారేడు, బిల్వపత్రాలు. ఇంకా అభిషేకం విషయానికి వస్తే… మీ ఇంట్లో శివలింగ౦ ఉంటె దానికి తెనే, పాలు, పెరుగు, పంచదార, నెయ్యి ఈ ఐదు సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్య లక్ష్మి తాండవిస్తుంది. వీటిని పంచామృతం అంటారు. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే అది శివుడికి అత్యంత ప్రీతికరమైన పూజగా అవుతుంది. ఒకవేళ ఉపవాసం చెయ్యలేని పక్షంలో అన్నం తినకుండా కేవలం పండ్లు అల్పాహారం తీసుకున్న మంచి పుణ్యం, శివుడి కృప కలుగుతుంది.

Image result for mahashivratri

శివరాత్రి రోజు పూజ సమయంలో లేత రంగు బట్టలు వెయ్యాలి, అంటే తెలుపు, పసుపు, లేత ఆకుపచ్చ లాంటివి అన్నమాట. శివరాత్రి రోజు మనం ఎన్నిసార్లు “ఓం నమఃశివాయ” అనే పంచాక్షరిని ఎన్నిసార్లు పలికితే అన్ని కోట్ల పుణ్యం మనకి శివుడు ప్రసాదిస్తాడు. ఈ రోజు శివపురాణం వినడం లేదా చదవడం చాలా చాలా శుభాదాయకం. శివ అనే నామానికి అర్థం ఒకటి శుభప్రదం అయితే మరొకటి మంగళకరమని పేర్కొంటున్నారు శివుని భక్తులు. హిందువుల దేవుళ్ళ లో ఇంతటి విశిష్టత కలిగిన శివుడి గురించి హిందువులు శివరాత్రి రోజు జాగరణ చేసి ఆ శివుని యొక్క ఆశీస్సులు అందుకుంటారు. ఆ రోజంతా శివరాత్రి రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణతో మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. శివరాత్రినాడు ఉపవాసం, జాగరణ చేసినవారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మహాశివరాత్రి రోజున జాగరణ చేసి పుణ్యం కట్టుకోండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation