కరోనా టెర్రర్ పందుల్ని ఏం చేశారో తెలుసా

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్​ పాముల నుంచి గబ్బిలాల నుంచి పాకిందట. అది కూడా ఆ వైరస్​కు మూలమైన చైనా సిటీ వుహాన్​ నుంచే మనుషుల్లోకి వచ్చిందట. చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. వుహాన్​లోని మార్కెట్లలో చేపలు, పందులతో పాటు పాములను కూడా అమ్ముతారు. వాటిని జనం తినడం వల్లే వైరస్​ పాకిందని తెలుస్తోంది. కొత్త కరోనా వైరస్​ జీన్స్​ను పాత కరోనావైరస్​ జీన్స్​తో పోల్చి చూసిన సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆ వైరస్​ ఉండే భౌగోళిక ప్రాంతాలు, వాటికి హోస్టులుగా ఉండే జంతువులను పరీక్షించారు. గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని తేల్చారు. ఈ మధ్య ఈ వైరస్ గురించి మరికొందరు డాక్టర్లు మాత్రం పందుల నుంచి కూడా వస్తుంది అని చెప్పడంతో పంది మాంసం తినడం మానేశారు.

Image result for కరోనా టెర్రర్ పందుల్ని

పందులనుంచి వైరస్ వస్తుందన్న భయంతో వాటిని లారీల్లో వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఊరి చివర భారీ గొయ్యి తీసి అందులో పడేసి హతమారుస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో గత వారం రోజులుగా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజుకి 10 నుంచి 20 మంది చనిపోతున్నారు. సోమవారం ఏకంగా 64మందికి పైగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య 425కి పెరిగింది. వైరస్ సోకినవారిలో 21 వేలమంది చికిత్స పొందుతున్నారు. చైనాతో పాటు కరోనా కారణంగా ఫిలిప్పీన్స్ లో ఒకరు చనిపోయారు.మరో వైపు అసలు పందులు పాములు గబ్బిలాలు వీటిలో వేటి నుంచి ఈ వైరస్ వస్తుంది అంటే సరిగ్గా ఇంకా పరీక్షించాలి అని చెబుతున్నారు.. బీజింగ్​లోని చైనీస్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ చేసిన స్టడీలోనూ ఈ విషయమే చెప్పారు.. కొత్త కరోనా వైరస్​కు పాములు, గబ్బిలాలే కారణమని ఆ స్టడీ తేల్చింది. అయితే, పాములు లేదా గబ్బిలాల నుంచి ఆ వైరస్​ మనుషులకు ఎలా సోకిందో మాత్రం రెండు స్టడీలూ తేల్చలేదు.

ఈ క్రింది వీడియోని చూడండి

వుహాన్​ సిటీలో చాలా మంది పాము మాంసం తింటారని, వాటిని తినడం వల్లే వైరస్​ సోకి ఉంటుందని చెబుతున్నారు. అంతేగాకుండా హెచ్​ఐవీ లాగానే ఈ కొత్త కరోనా వైరస్​కూ తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మరోవైపు వైరస్​కు మూలకారణమైన వుహాన్​ సిటీకి రాకపోకలను చైనా బంద్​ చేసింది. కోటి మందికిపైగా ఉండే వుహాన్​ నుంచి వేరే సిటీలు, దేశాలకు వెళ్లే ఫ్లైట్లు, వేరే సిటీల నుంచి అక్కడకు వచ్చే విమానాలన్నింటినీ రద్దు చేసేసింది. ఇక ఈ వైరస్ భయంతో అక్కడ పంది పాము గబ్బిలాల మాంసం ప్రతీ రెస్టారెంట్లో అమ్మడం మానేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation