తెలంగాణాలో దారుణం..ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్.. చివరికి షాక్.

103

ఇటీవల కాలంలో పాపులర్ అయిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం టిక్ టాక్ ఎంత వినోదాన్ని అందిస్తుందో, అంతేస్థాయలో వివాదాలనూ సృష్టిస్తోంది. విధులను పక్కన పెట్టి ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ వీడియోలు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవడం.. భర్తలు వద్దంటున్నా హాట్ హాట్ వీడియోలు చేసి కొందరు భార్యలు తమ కాపురాలు చేజేతులా కూల్చుకోవడం వంటివి ఇప్పటికే చూశాం. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో టిక్ టాక్ మరోసారి వివాదానికి దారితీసింది.

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేస్తూ చేసిన టిక్ టాక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆపరేషన్ థియేటర్ లో రోగికి శస్త్రచికిత్స చేస్తూ, ఇతర సిబ్బందితో డాక్టర్ టిక్ టాక్ చేయడం కలకలం రేపింది. దీంతో ఆ డాక్టర్స్ వీడియోలు వైరల్ గా మారాయి. హుజురాబాద్ ఆర్ఎంవో డాక్టర్ శ్రీకాంత్, అతని వైద్య బృందం ఈ టిక్ టాక్ వీడియో చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్, ఆయన బృందం ఆపరేషన్ చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోలో తమిళ హీరో విజయ్ తెలుగు డైలాగ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ డాక్టర్ ఇలా సర్జరీ చేస్తున్న సమయంలో వీడియోలు రికార్డు చెయ్యడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. పేషెంట్ ను పక్కన పెట్టి గవర్నమెంట్ డాక్టర్ ఇలా వీడియోలు చేస్తే, ఆ పేషెంట్ కు ఏమన్నా అయితే బాధ్యత ఎవరిది? అని మండిపడుతున్నారు. డాక్టర్ అయి ఉండి, అందులోను ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేస్తూ ఇలా చెయ్యటం దారుణం అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Image result for ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్

అయితే ఆ వైరల్ వీడియోలపై ఆర్ఎంవో డాక్టర్ శ్రీకాంత్ స్పందించారు. ఎవరో కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఎంతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తినని, ఆపరేషన్ చేసే సమయంలో ఫ్రూఫ్ కోసం, మీడియాకు అందించేందుకు ఆపరేషన్ చేసే వీడియోలు తీస్తామన్నారు. కావాలనే ఎవరో ఫేక్ ఐడి క్రియేట్ చేసి, ఆపరేషన్ థియేటర్ లోని వీడియోలతో టిక్ టాక్ చేశారన్నారు. తాను తప్పు చేశానని రుజువైతే శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని డాక్టర్ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. ఇలా డాక్టర్స్, నర్స్ లు టిక్ టాక్ వీడియోలు తీయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా తెలంగాణకు చెందిన కొందరు నర్స్ లు ఆపరేషన్ థియేటర్ లో టిక్ టాక్ వీడియోలు చేసి సమస్యలను కొనితెచ్చుకున్న. అలాగే ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని విధుల్లో ఉన్న సమయంలో టిక్ టాక్ వీడియోలు చెయ్యగా ఆమెను సస్పెండ్ చేసారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే మళ్ళి చోటుచేసుకుంది. చూడాలి మరి ఈ ఘటన పై తెలంగాణ సర్కార్ ఎలాంటి చర్య తీసుకుంటుందో.

Content above bottom navigation