రేణుకకు స్కాన్ చేసిన డాక్టర్స్.. ఆడపిల్లనా? మగపిల్లాడా?

253

రెండు నెలల కింద హైదరాబాద్‌లో జరిగిన అతి నీచమైన ఘటన దిశ రేప్ అండ్ మర్డర్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎపిసోడ్‌లో పది రోజులకే నిందితులను కాల్చి చంపేసారు పోలీసులు. ఇందులో మలుపులు లేవు.. ట్విస్టులు లేవు.. రేప్ చేసిన ఒక్క రోజులోనే నిందుతులను పట్టుకున్నారు ఖాకీలు. ఆ తర్వాత విచారణ పూర్తి చేసి.. సీన్ రీ కన్సస్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయారని కాల్చి పడేసారు. ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఆ తర్వాత ఎన్ కౌంటర్ మీద కేసు వెయ్యడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు కోర్ట్ లో నడుస్తుంది. ఈ విషయాలన్నీ ఇలా ఉంటె ఆ ఎన్ కౌంటర్ వలన ఎక్కువ నష్టపోయింది నిందితులలో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక అనే చెప్పుకోవాలి.

ఈ క్రింది వీడియోని చూడండి

చెన్నకేశవులు భార్య రేణుక వయసు 13సంవత్సరాలే అని తేలింది. అతి చిన్న వయసులోనే ప్రేమ వివాహం చేసుకొని గర్భందాల్చింది. ఇప్పుడు కడవరకు ఉండాల్సిన భర్త మధ్యలోనే దారుణమైన ఘటనలు చేసి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. దీంతో రేణుక ఒంటరి అయ్యింది. అయితే ఈ ఘటన తర్వాత రేణుక మీద అందరికి సానుభూతి ఏర్పడింది. చాలామంది ఆమెకు సాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మధ్యనే కలిసి ఆమెకు ఆర్థిక సాయం చేశాడు. అలాగే దిశా ఘటన మీద సినిమా కూడా తీయ్యనున్నట్టు ప్రకటించాడు. ఇక రేణుక ప్రస్తుతం గర్భంతో ఉంది. ఆమెకు ఇప్పుడు ఏడవ నెల. అయితే కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకుందామని స్కానింగ్ కు వెళ్తే ఆమెను చెక్ చేసిన డాక్టర్స్ రేణుక చాలా వీక్ గా ఉందని చెప్పారంట. కడుపుతో ఉన్న మహిళా సరైన టైమ్ కు తినాలి, మంచి ఫుడ్ తినాలి. కానీ రేణుక అలా చేయకపోవడంతో చాలా వీక్ గా ఉందంట.

Image result for disha renuka

అలాగే కడుపులో బిడ్డ కూడా చాలా వీక్ గా ఉందని స్కానింగ్ చేసి చెప్పారు. అయితే కడుపులో ఉన్నది ఆడపిల్లనో, మగపిల్లాడో చెప్పలేదు. అలా చెప్పడం చట్టరీత్య నేరం కాబట్టి కడుపులో ఉన్నది ఎవరో చెప్పలేదు. అయితే ఆడపిల్ల పుట్టినా కూడా నేను కాపాడుకుంటా చెప్పమని చెప్పినా కూడా డాక్టర్స్ చెప్పలేదని సమాచారం. కడుపులో బిడ్డ చాలా వీక్ గా ఉన్నాడని, మంచి ఫుడ్ తినమని, కేరింగ్ ఎక్కువగా తీసుకోమని రేణుకకు డాక్టర్స్ సూచించారట. రేణుక ఇంతకముందే తనకు ఆడపిల్ల కావాలని చెప్పింది. నాకు కూతురు పుడితే దిశా అని పేరు పెడతా అని కూడా మీడియాకు చెప్పింది. చూడాలి మరి రేణుకకు ఎవరు పుడతారో..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation